శ్రీకాంత్‌కు చుక్కెదురు

Published on Wed, 05/14/2025 - 03:33

బ్యాంకాక్‌: ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత అగ్రశ్రేణి షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాంత్‌ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. 

మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ చివరి రౌండ్‌ మ్యాచ్‌లో తెలంగాణకు చెందిన తరుణ్‌ మన్నేపల్లి 21–16, 21–19తో శ్రీకాంత్‌ను బోల్తా కొట్టించి మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందాడు.అంతకుముందు క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో 23 ఏళ్ల తరుణ్‌ 17–21, 21–19, 21–17తో కువో కువాన్‌ లిన్‌ (చైనీస్‌ తైపీ)పై, 32 ఏళ్ల శ్రీకాంత్‌ 21–15, 21–17తో శంకర్‌పై గెలుపొందారు. భారత్‌కే చెందిన ఆయుశ్‌ శెట్టి, ఐరా శర్మ కూడా మెయిన్‌ ‘డ్రా’కు చేరుకోలేకపోయారు. 

క్వాలిఫయింగ్‌ ఫైనల్‌ రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఆయుశ్‌ శెట్టి 14–21, 20–22తో జస్టిన్‌ హో (మలేసియా) చేతిలో, ఐరా 12–21, 18–21తో థమన్‌వోన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో మొహిత్‌–లక్షిత (భారత్‌) జోడీ 8–21, 10–21తో ఎన్జీ సాజ్‌ యావు–చాన్‌ యిన్‌ చాక్‌ (హాంకాంగ్‌) ద్వయం చేతిలో ఓడింది.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)