Breaking News

చాంప్స్‌ కీ స్టోన్, సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జట్లు

Published on Wed, 12/10/2025 - 08:46

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా వార్షిక లీగ్‌ బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల విభాగంలో కీ స్టోన్‌ బాస్కెట్‌బాల్‌ అకాడమీ... మహిళల విభాగంలో సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజీ జట్టు విజేతలుగా నిలిచాయి. ఫైనల్స్‌లో కీ స్టోన్‌ జట్టు 75–66తో టైటాన్స్‌పై గెలుపొందింది. మ్యాచ్‌ మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనే వరకు ఇరు జట్లు హోరాహోరీగా పోరాడగా... ఆఖర్లో జోరు పెంచిన కీ స్టోన్‌ జట్టు... కీలక పాయింట్లు ఖాతాలో వేసుకొని విజేతగా అవతరించింది. మ్యాచ్‌ ఆరంభంలో టైటాన్స్‌ చక్కటి ప్రదర్శన కనబర్చింది. ఒకదశలో 12–3తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత తేరుకున్న కీ స్టోన్‌ ప్లేయర్లు సత్తాచాటి జట్టును పోటీలోకి తెచ్చారు. కీ స్టోన్‌ అకాడమీ తరఫున సహర్ష్‌    21 పాయింట్లతో విజృంభించగా... సుభాశ్‌ 17, ప్రీతమ్‌ 10 పాయింట్లు సాధించారు. 

క్రిష్య, ఆర్యన్‌ చెరో 8 పాయింట్లు సాధించగా... ప్రతీక్‌ 5, కార్తీక్‌ 4 పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు. టైటాన్స్‌ తరఫున సల్మాన్‌ 16 పాయింట్లతో టాప్‌లో నిలవగా... నందిత్‌ 12, సూర్య 111, క్రిస్‌ 11, విక్కీ 10 పాయింట్లు సాధించారు. మహిళల విభాగంలో సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జట్టు 57–55 పాయింట్లతో నిజాం బాస్కెట్‌బాల్‌ జట్టుపై గెలిచింది. సెయింట్‌ ఫ్రాన్సిస్‌ తరఫున పరీ 17 పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించింది. సంహిత 14, సానియా 11, హిబా 6, రేఖ 5 పాయింట్లు సాధించారు. నిజాంబాస్కెట్‌బాల్‌ జట్టు తరఫున అమిత 16, జాహ్నవి 14, శ్రుతి 10, లాస్య 9, ఖుష్బూ 6 పాయింట్లు సాధించారు.    

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)