Breaking News

కెన్యా స్టార్‌ అథ్లెట్‌ రుత్‌పై మూడేళ్ల నిషేధం

Published on Fri, 10/24/2025 - 04:13

నైరోబి: మారథాన్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన కెన్యా మహిళా అథ్లెట్‌ రుత్‌ చెప్‌నెటిక్‌ డోపింగ్‌లో దొరికిపోయింది. దీంతో అథ్లెట్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ (ఏఐయూ) ఆమెపై మూడేళ్ల నిషేధం విధించింది. రెండేళ్ల క్రితం చికాగో మారథాన్‌లో చెప్‌నెటిచ్‌ విజేతగా నిలిచింది. 2023లో అమెరికాలో జరిగిన ఈ సుదీర్ఘ పరుగును ఆమె 2 గంటల 9 నిమిషాల 56 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. గత రికార్డు టైమింగ్‌ కంటే 1 నిమిషం 57 సెకన్ల ముందే పూర్తి చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. 

అయితే ఈ ఏడాది మార్చిలో ఆమె నుంచి సేకరించిన నమూనాల్లో నిషిద్ధ ఉ్రత్పేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో జూలైలోనే ఆమెపై తాత్కాలిక నిషేధం విధించారు. తదుపరి ఏఐయూ విచారణలో ఆమె తను ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదని వివరణ ఇచ్చింది. నమూనాల సేకరణకు కొద్ది రోజుల ముందే తాను అస్వస్థతకు గురైనపుడు పనిమనిషి ఇచి్చన మందు వల్లే ఉ్రత్పేరకాలు అందులో ఉండొచ్చని పేర్కొంది. దీనికి సంబంధించిన ఔషధం ఫొటోనూ ఏఐయూకు సమర్పించింది. 

అయితే ఓ ప్రొఫెషనల్‌ అథ్లెట్‌ అయివుండి డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా ఏదిపడితే అది వాడటం నిర్లక్ష్యం కిందకే వస్తుంది తప్ప... శిక్ష నుంచి తప్పించుకునేందుకు వీలుండదని ఏఐయూ మందలించింది. నాలుగేళ్ల నిషేధం విధించాల్సిన చోట, ఆమె తప్పు ఒప్పుకోవడంతో మూడేళ్ల నిషేధాన్ని ఖరారు చేసింది. ఈ ఏప్రిల్‌ 19 నుంచే ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఏఐయూ వెల్లడించింది.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)