Breaking News

శ్రీశాంత్‌కు భారీ ఊరట

Published on Wed, 07/01/2026 - 17:34

టీమిండియా మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌కు భారీ ఊరట లభించింది. ఈ పేస్‌ బౌలర్‌పై కేరళ క్రికెట్‌ అసోసియేషన్‌ నిషేధాన్ని ఎత్తివేసింది. బుధవారం జరిగిన ప్రత్యేక వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

కాగా గతేడాది.. టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ విషయంలో శ్రీశాంత్‌ కేరళ క్రికెట్‌ అసోసియేషన్‌ (KCA)పై విమర్శలు గుప్పించాడు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 జట్టుకు ఎంపిక కాకుండా పరోక్షంగా KCA సంజూకు అడ్డుపడిందని ఆరోపించాడు. అతడిని దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడకుండా చేసిందని శ్రీశాంత్‌ అసోసియేషన్‌ను నిందించాడు.

ఈ నేపథ్యంలో అసోసియేషన్‌ ప్రతిష్ట, విశ్వసనీయతను దెబ్బతీసేలా వ్యవహరించాడంటూ కేసీఏ శ్రీశాంత్‌పై మూడేళ్ల నిషేధం విధించింది. అయితే, ఈ విషయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ శ్రీశాంత్‌ అసోసియేషన్‌కు భేషరతుగా క్షమాపణలు చెప్పాడు.

అందుకే తాము శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేస్తున్నామని అసోసియేషన్‌ బుధవారం వెల్లడించింది. కాగా 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టులో శ్రీశాంత్‌ సభ్యుడు. ఆటలో నైపుణ్యంతో పాటు.. అతడి జీవితంలో వివాదాలకూ కొదవలేదు.

ఐపీఎల్‌-2013 సీజన్‌లో ఫిక్సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో అతడిపై జీవితకాల నిషేధం పడింది. అయితే ఆరేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో ఈ శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో 2020లో శ్రీశాంత్‌పై నిషేధం తొలగిపోయింది. 

కాగా టీమిండియా తరఫున శ్రీశాంత్‌ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 87, 75, 40 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో హర్భజన్‌ సింగ్‌ శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టగా ‘స్లాప్‌గేట్‌’ పేరిట రేగిన వివాదం లీగ్‌ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది.    

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)