Breaking News

కావ్య మారన్ షాకింగ్ నిర్ణయం..! సన్‌రైజర్స్ టీమ్ కొత్త కెప్టెన్ అత‌డే?

Published on Sat, 09/13/2025 - 21:18

సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజ‌న్‌కు ముందు కావ్య మారన్ జట్టు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కొత్త కెప్టెన్‌ను ప్ర‌క‌టించేందుకు సిద్ద‌మైంది. తొలి సీజ‌న్ నుంచి సన్‌రైజర్స్ ఈస్ట‌ర్న్ కేప్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన ఐడైన్ మార్‌క్ర‌మ్‌.. నాలుగో సీజ‌న్‌కు ముందు తెగ‌దెంపులు చేసుకున్నాడు. 

వేలంలోకి వ‌చ్చిన అత‌డిని రూ.7 కోట్ల భారీ ధ‌ర‌కు డ‌ర్బ‌న్ సూప‌ర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఈ వేలంలో మార్‌క్ర‌మ్‌ను తిరిగి ద‌క్కించుకోవ‌డానికి స‌న్‌రైజ‌ర్స్‌ రైట్ టు మ్యాచ్ (RTM) కార్డును ఉపయోగించింది. కానీ డ‌ర్బ‌న్ భారీ ధ‌ర చెల్లించేందుకు సిద్దం కావ‌డంతో ఈస్టర్న్ కేప్ వెన‌క్కి త‌గ్గింది.

కెప్టెన్‌గా ట్రిస్ట‌న్ స్ట‌బ్స్‌..
కాగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కొత్త కెప్టెన్‌గా 25 ఏళ్ల యువ ఆట‌గాడు, సౌతాఫ్రికా సూప‌ర్ స్టార్ ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ ఎంపిక దాదాపు ఖారైన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని బ్యాటింగ్ కోచ్ రస్సెల్ డొమింగో ధ్రువీక‌రించాడు. ఇప్ప‌టికే అత‌డి కెప్టెన్‌గా నియ‌మిచేందుకు యాజ‌మాన్యం సైతం అంగీక‌రించిన‌ట్లు డొమింగో తెలిపాడు. 

రాబోయే రెండు సీజన్ల పాటు త‌మ కెప్టెన్‌గా స్ట‌బ్స్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడ‌ని అత‌డు తెలిపాడు. త్వ‌రలోనే స‌న్‌రైజ‌ర్స్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశ‌ముంది. అయితే జ‌ట్టులో సీనియర్లు క్వింటన్ డి కాక్, లూయిస్ గ్రెగొరీ, జానీ బెయిర్‌స్టో, మార్కో జాన్సెన్ వంటి ప్లేయర్లు ఉన్నా.. టీమ్ యాజమాన్యం స్ట‌బ్స్ వైపు మొగ్గు చూప‌డం గ‌మనార్హం. 

సౌతాఫ్రికా టీ20 లీగ్ తొలి సీజ‌న్ నుంచి స‌న్‌రైజ‌ర్స్‌తోనే స్ట‌బ్స్ కొన‌సాగుతున్నాడు. మూడు సీజన్లలో అతను మొత్తం 723 పరుగులు సాధించాడు. అత‌డి స్ట్రైక్ రేట్  140.11 పైగా ఉండ‌డం విశేషం.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)