Breaking News

వెస్టిండీస్‌ బ్యాటర్‌ సరికొత్త చరిత్ర

Published on Sun, 11/08/2026 - 21:00

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ మిడిలార్డర్ బ్యాటర్ కేవమ్ హాడ్జ్ అద్భుతమైన సెంచ‌రీతో చెల‌రేగాడు.  నాలుగువ‌ రోజు నాటి ఆటలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన 33 ఏళ్ల హాడ్జ్ త‌న సూప‌ర్ బ్యాటింగ్‌తో విండీస్‌ను ప‌టిష్ట‌ స్థితిలో నిలిపాడు. 189 బంతుల్లో17 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 140 ప‌రుగులు చేసి ఇంకా క్రీజులో ఉన్నాడు. అత‌డికి ఇది మూడో టెస్టు సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో కేవమ్ హాడ్జ్ ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.

బంగ్లాదేశ్ గడ్డపై టెస్టుల్లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ సాధించిన వెస్టిండీస్ టాపార్డర్‌ బ్యాట‌ర్‌గా కేవమ్ హాడ్జ్ నిలిచాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు డారెన్ బ్రావో పేరిట ఉండేది. 2012లో ఖుల్నా వేదికగా జరిగిన టెస్టులో డారెన్ బ్రావో 127 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌తో బ్రావో ఆల్‌టైమ్ రికార్డును హాడ్జ్ బ్రేక్ చేశాడు.

బంగ్లాదేశ్‌లో విండీస్ టాప్-ఆర్డర్ బ్యాటర్ల అత్యధిక టెస్టు స్కోర్లు:

కేవమ్ హాడ్జ్: 140* వ‌ర్సెస్‌ బంగ్లాదేశ్ (సిల్హెట్, 2026)

డారెన్ బ్రావో: 127 వ‌ర్సెస్‌ బంగ్లాదేశ్ (ఖుల్నా, 2012)

కిర్క్ ఎడ్వర్డ్స్: 121 వ‌ర్సెస్‌ బంగ్లాదేశ్ (మీర్పూర్, 2011)

రామ్‌నరేష్ సర్వాన్: 119 వ‌ర్సెస్  బంగ్లాదేశ్ (ఢాకా)

కియారన్ పొవెల్: 117 వ‌ర్సెస్  బంగ్లాదేశ్ (మీర్పూర్, 2012)
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)