Breaking News

ఆనంద్‌ వెనుకంజ

Published on Fri, 10/10/2025 - 04:23

సెయింట్‌ లూయిస్‌ (అమెరికా): జగద్విఖ్యాత చెస్‌ దిగ్గజాలు విశ్వనాథన్‌ ఆనంద్, గ్యారీ కాస్పరోవ్‌ల మధ్య జరుగుతున్న క్లచ్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌కు తొలిరోజు కలిసిరాలేదు. దీంతో రష్యన్‌ గ్రాండ్‌మాస్టర్‌ కాస్పరోవ్‌ పైచేయి సాధించాడు. గురువారం జరిగిన నాలుగు గేమ్‌ల ఫలితాల అనంతరం కాస్పరోవ్‌ 2.5–1.5తో ఆనంద్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. 

తద్వారా రిటైర్‌ అయిన 21 ఏళ్ల తర్వాత బరిలోకి దిగిన 62 ఏళ్ల రష్యన్‌ దిగ్గజం తనలో గెలిచేసత్తా ఏమాత్రం తగ్గలేదని తన ‘ఎత్తులు–పైఎత్తుల’తో చాటాడు. ముందుగా జరిగిన రెండు గేమ్‌లు కూడా డ్రాగానే ముగిశాయి. దీంతో ఇద్దరు 1–1తో సమవుజ్జీలుగా నిలిచారు. మూడో గేమ్‌లో కాస్పరోవ్‌ విజయం సాధించడంతో 2–1తో పైచేయి సాధించాడు. తర్వాత జరిగిన నాలుగో రౌండ్‌ గేమ్‌ డ్రాగా ముగియడంతో ఇద్దరికి చెరో అర పాయింట్‌ లభించింది. 

ఈ టోర్నీలో రెండో రోజు కూడా నాలుగు గేమ్‌లు జరుగుతాయి. రెండు ర్యాపిడ్, రెండు బ్లిట్జ్‌ గేమ్‌లు కాగా... రెండో రోజు విజయం సాధిస్తే 2 పాయింట్లు, మూడో రోజు విజయానికి 3 పాయింట్లు లభిస్తాయి. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో జరిగే పోటీలు మరింత ఆసక్తికరంగా జరగనున్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)