Breaking News

SRH Vs CSK: వారెవ్వా మెండిస్‌.. ఐపీఎల్ చ‌రిత్రలోనే సంచ‌ల‌న క్యాచ్‌

Published on Fri, 04/25/2025 - 22:32

ఐపీఎల్‌-2025లో చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్లేయ‌ర్ కమిందు మెండిస్ సంచ‌ల‌న క్యాచ్‌తో మెరిశాడు. మెండిస్ అద్బుత‌మైన క్యాచ్‌తో సీఎస్‌కే ఆట‌గాడు డెవాల్డ్ బ్రెవిస్‌ను పెవిలియ‌న్‌కు పంపాడు.

చెన్నై ఇన్నింగ్స్ 13వ ఓవ‌ర్ వేసిన హ‌ర్ష‌ల్ ప‌టేల్ ఐదో బంతిని బ్రెవిస్‌కు ఔట్ సైడ్ ఆఫ్ స్లో డెలివ‌రీగా సంధించాడు. ఆ బంతిని బేబీ ఏబీడీ లాంగాఫ్ దిశ‌గా భారీ షాట్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించాడు. షాట్ స‌రిగ్గా క‌న‌క్ట్ కావడంతో అంతా సిక్స్ అని భావించారు. కానీ లాంగాఫ్‌లో ఉన్న మెండిస్ అద్భుతం చేశాడు. 

లాంగ్-ఆఫ్‌లో ఉన్న మెండిస్ గాలిలోకి తన ఎడమ వైపున‌కు దూకి సూపర్‌మ్యాన్‌లా క్యాచ్ అందుకున్నాడు. ఇది చూసిన బ్రెవిస్ ఒక్క‌సారిగా షాక్ పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఈ ఏడాది సీజ‌న్‌లో అత్యుత్త‌మ క్యాచ్ అని నెటిజ‌న్లు కొనియాడుతున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 19.5 ఓవ‌ర్ల‌లో 154 ప‌రుగుల‌కే ఆలౌటైంది. చెన్నై బ్యాట‌ర్ల‌లో డెవాల్డ్ బ్రెవిస్‌(42) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మాత్రే(30), ర‌వీంద్ర జ‌డేజా(21) రాణించారు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ప్యాట్ క‌మ్మిన్స్‌, జ‌య‌దేవ్ ఉన‌ద్క‌ట్ త‌లా రెండు వికెట్లు సాధించారు. సీఎస్‌కే కెప్టెన్ ధోనికి ఇది 400వ టీ20 మ్యాచ్ కావడం గమనార్హం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)