Breaking News

63 టెస్టులు.. 294 వికెట్లు! జాక్వెస్ కల్లిస్ రికార్డు బ‌ద్ద‌లు

Published on Sun, 08/11/2024 - 11:49

ట్రినిడాడ్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో ర‌బాడ‌ నిప్పులు చేరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 18 ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన ర‌బాడ‌..  మూడు కీల‌క‌ వికెట్లు ప‌డ‌గొట్టి విండీస్‌ను దెబ్బ తీశాడు. 

అత‌డితో పాటు మ‌హారాజ్ 4 వికెట్ల ప‌డ‌గొట్ట‌డంతో ఆతిథ్య క‌రేబియ‌న్ జ‌ట్టు  మొద‌టి ఇన్నింగ్స్‌లో 233 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో ప్రోటీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 124 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. విండీస్ బ్యాట‌ర్ల‌లో కీసీ కార్తీ(42) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అంత‌కుముందు ద‌క్షిణాఫ్రికా త‌మ ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 357 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

ర‌బాడ అరుదైన ఘ‌న‌త..
ఇక  ఈ మ్యాచ్‌లో కగిసో ర‌బాడ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన ఆరో స‌ఫారీ బౌల‌ర్‌గా ర‌బ‌డ రికార్డుల‌కెక్కాడు. విండీస్ బ్యాట‌ర్ కావెం హాడ్జ్‌ను ఔట్ చేసిన ర‌బాడ‌.. ఈ అరుదైన ఫీట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

 ఇప్ప‌టివ‌ర‌కు 63 టెస్టులు ఆడిన ర‌బాడ 294 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు ప్రోటీస్ క్రికెట్ దిగ్గ‌జం జాక్వెస్ కల్లిస్ (291) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో క‌ల్లిస్‌ను రబాడ అధిగ‌మించాడు. ఇక ఈ జాబితాలో ద‌క్షిణాఫ్రికా పేస్ గ‌న్ డేల్ స్టెయిన్ 439 వికెట్లతో అగ్ర‌స్ధానంలో ఉన్నాడు. ఆ త‌ర్వాతి స్ధానాల్లో షాన్ పొలాక్‌(421), ఎన్తిని(390) ఉన్నారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)