Breaking News

జ్యోతి యర్రాజీ సర్జరీ సక్సెస్‌

Published on Mon, 07/14/2025 - 04:31

సాక్షి, హైదరాబాద్‌: గాయంతో ఇబ్బంది పడుతున్న భారత స్టార్‌ అథ్లెట్‌ జ్యోతి యర్రాజీ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుంది. ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో 12.96 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం నెగ్గిన జ్యోతి... ప్రాక్టీస్‌ సందర్భంగా గాయపడింది. దీంతో పోటీలకు దూరమైన జ్యోతి... తాజాగా యాంటిరియర్‌ క్రూసియేట్‌ లిగమెంట్‌ (ఏసీఎల్‌)కు సర్జరీ చేయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. ప్రముఖ వైద్యుడు దిన్‌షా పర్దీవాలా పర్యవేక్షణలో జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని తెలిపింది. 

‘గత కొన్ని వారాలు భారంగా గడిచాయి. గాయం కారణంగా అమితంగా ఇష్టపడే అథ్లెటిక్స్‌కు దూరంగా ఉండాల్సి రావడం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఈ శుక్రవారం సర్జరీ విజయవంతంగా పూర్తైంది. కష్ట సమయంలో అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, కోచ్‌లు, భారత అథ్లెటిక్స్‌ సమాఖ్యకు ప్రత్యేక ధన్యవాదాలు. త్వరలోనే తిరిగి కోలుకుంటా. రెట్టించిన ఉత్సాహంతో ట్రాక్‌పై అడుగుపెట్టాలని భావిస్తున్నా’ అని జ్యోతి పేర్కొంది. 

ఇటీవల నిలకడగా రాణిస్తున్న జ్యోతి... టోక్యో వేదికగా జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాలని ఆశించినా... ఇప్పుడది సాధ్యపడేలా లేదు. వరల్డ్‌ అథ్లెటిక్స్‌ అర్హత మార్క్‌ 12.73 సెకన్లు కాగా... జ్యోతి నేరుగా ఈ అవకాశం దక్కించుకోకపోయినా ర్యాంకింగ్స్‌ ఆధారంగా ఆమెకు ఈ మెగా టోర్నీలో అవకాశం దక్కేది.   

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)