Breaking News

ఫైనల్లో జ్యోతి సురేఖ బృందం

Published on Thu, 05/23/2024 - 03:04

యెచోన్‌ (దక్షిణ కొరియా): కొత్త సీజన్‌లో తమ జోరు కొనసాగిస్తూ భారత మహిళల కాంపౌండ్‌ ఆర్చరీ జట్టు వరుసగా రెండో స్వర్ణ పతకంపై గురి పెట్టింది. ప్రపంచకప్‌ స్టేజ్‌–2 టోర్నీలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, పర్ణిత్‌ కౌర్, అదితి స్వామిలతో కూడిన టీమిండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. 

సెమీఫైనల్లో జ్యోతి సురేఖ బృందం 233–229 పాయింట్లతో అమెరికా జట్టును ఓడించింది. టీమ్‌ క్వాలిఫయింగ్‌లో రెండో స్థానంలో నిలువడం ద్వారా నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ ఆడిన భారత జట్టు 236–234 పాయింట్లతో ఇటలీ జట్టుపై గెలిచింది. శనివారం జరిగే ఫైనల్లో టర్కీతో భారత జట్టు పోటీపడుతుంది. షాంఘైలో గతనెలలో జరిగిన ప్రపంచకప్‌ స్టేజ్‌–1 టోర్నీలో జ్యోతి సురేఖ, పర్ణిత్, అదితి బృందం పసిడి పతకాన్ని సాధించింది. 

మరోవైపు ప్రియాంశ్, ప్రథమేశ్, అభిõÙక్‌ వర్మలతో కూడిన భారత పురుషుల జట్టు కాంపౌంట్‌ టీమ్‌ విభాగంలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. కాంస్య పతక పోరులో భారత్‌ 233–233తో ఆ్రస్టేలియా చేతిలో ఓడిపోయింది. స్కోరు సమం కావడంతో ‘షూట్‌ ఆఫ్‌’ నిర్వహించగా... ‘షూట్‌ ఆఫ్‌’లోనూ రెండు జట్లు 30–30తో సమంగా నిలిచాయి. అయితే భారత ఆర్చర్లు సంధించిన బాణాల కంటే ఆసీస్‌ ఆర్చర్లు కొట్టిన రెండు బాణాలు కేంద్ర బిందువుకు అతి సమీపంగా ఉండటంతో ఆస్ట్రేలియాకు కాంస్య పతకం ఖరారైంది. 

#

Tags : 1

Videos

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు