Breaking News

జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్‌’ 

Published on Sun, 04/28/2024 - 03:42

షాంఘై (చైనా): ప్రపంచ ఆర్చరీ కాంపౌండ్‌ విభాగంలో భారత్‌కు చెందిన వెన్నం జ్యోతిసురేఖ మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వరల్ట్‌ కప్‌ స్టేజ్‌ 1 టోర్నీలో శనివారం జ్యోతి సురేఖ 3 స్వర్ణ పతకాలతో మెరిసింది. దీపికా కుమారి (2021) తర్వాత వరల్డ్‌ కప్‌లో 3 పసిడి పతకాలు గెలిచిన రెండో భారత ఆర్చర్‌గా సురేఖ నిలిచింది. మహిళల, మిక్స్‌డ్, టీమ్‌ ఈవెంట్లలో ఆమె అగ్రస్థానాన్ని సాధించడం విశేషం. 

మహిళల ఈవెంట్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ ఆండ్రియా బెకెరా (మెక్సికో)ను ఓడించింది. ఇద్దరి స్కోర్లు 146–146తో సమం కాగా...షూటాఫ్‌ ఫినిష్‌తో సురేఖ పైచేయి సాధించింది. మిక్స్‌డ్‌ ఈవెంట్‌ ఫైనల్లో జ్యోతిసురేఖ – అభిషేక్‌ వర్మ ద్వయం 158–157 స్కోరుతో లిసెల్‌ జాత్మా – రాబిన్‌ జాత్మా (ఎస్తోనియా)పై విజయం సాధించింది. మహిళల టీమ్‌ ఈవెంట్‌ తుది పోరులోలో సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌లతో కూడిన భారత జట్టు 236–225 తేడాతో ఇటలీ జట్టుపై గెలుపొందింది.

పురుషుల విభాగంలో మరో 2 పతకాలు కూడా భారత్‌ ఖాతాలో చేరాయి. పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రియాన్‌‡్ష రజతం గెలుచుకున్నాడు. ఫైనల్లో అతను 147–150 తేడాతో నికో వీనర్‌ (ఆ్రస్టియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. అయితే పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు బంగారం లభించింది. ఫైనల్‌ అభిõÙక్‌ వర్మ, ప్రియాన్‌‡్ష, ప్రథమేశ్‌లతో కూడిన భారత జట్టు 238–231తో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. ఈ టోర్నీ రికర్వ్‌ విభాగం ఫైనల్‌ మ్యాచ్‌లు ఆదివారం జరుగుతాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)