Breaking News

సెమీఫైనల్లో జ్యోతి సురేఖ, పర్ణీత్‌

Published on Fri, 07/11/2025 - 04:17

మాడ్రిడ్‌: ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌–4 టోర్నమెంట్‌ మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ, పర్ణీత్‌ కౌర్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జ్యోతి సురేఖ 147–144తో హజల్‌ బురున్‌ (తుర్కియే)పై, పర్ణీత్‌ కౌర్‌ 142–141తో క్యూర్‌ గిరిడి (తుర్కియే)పై విజయం సాధించారు. మరోవైపు రికర్వ్‌ విభాగంలో భారత జట్లకు నిరాశ ఎదురైంది. భారత పురుషుల, మహిళల జట్లు కనీసం మూడో రౌండ్‌కు కూడా చేరుకోలేకపోయాయి. 

ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ బొమ్మదేవర ధీరజ్, రాహుల్, నీరజ్‌ చౌహాన్‌లతో కూడిన భారత పురుషుల జట్టు రెండో రౌండ్‌లో 2–6 (55–56, 54–57, 57–56, 54–56) సెట్‌ పాయింట్ల స్కోరుతో జ్విక్‌ ఎలీ, మార్కస్‌ అల్మీదా, మథియాస్‌ గోమ్స్‌లతో కూడిన బ్రెజిల్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. 

దీపిక కుమారి, అంకిత, గాథ ఖడకేలతో కూడిన భారత మహిళల జట్టు కూడా రెండో రౌండ్‌లోనే వెనుదిరిగింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన భారత జట్టు రెండో రౌండ్‌లో 3–5 (58–54, 55–55, 54–55, 53–54) సెట్‌ పాయింట్ల స్కోరుతో అమెలీ కార్డెయు, లీసా బార్బెలిన్, విక్టోరియా సెబాస్టియన్‌లతో కూడిన ఫ్రాన్స్‌ జట్టు చేతిలో ఓటమి పాలైంది.    

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)