Breaking News

Federation Cup 2023: జ్యోతి ‘పసిడి’ పరుగు 

Published on Thu, 05/18/2023 - 10:04

రాంచీ: జాతీయ ఫెడరేషన్‌ కప్‌ సీనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి విజేతగా నిలిచింది. జ్యోతి అందరికంటే వేగంగా 12.89 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

నిత్య రామరాజ్‌ (తమిళనాడు; 13.44 సెకన్లు) రజతం... సప్న కుమారి (జార్ఖండ్‌; 13.58 సెకన్లు) కాంస్యం గెలిచారు. తెలంగాణ అథ్లెట్‌ అగసార నందిని 13.65 సెకన్లతో ఐదో స్థానంలో నిలిచింది. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ లావెటి యశ్వంత్‌ కుమార్‌ 14.62 సెకన్లలో గమ్యానికి చేరి చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచాడు.   

భారత ఆర్చరీ జట్లకు నిరాశ 
షాంఘై: ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–2 టోర్నీలో కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లకు నిరాశ ఎదురైంది. రెండు విభాగాల్లో భారత జట్లు క్వార్టర్‌ ఫైనల్‌ దాటలేకపోయాయి.

మహిళల టీమ్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి, అవ్‌నీత్‌ కౌర్‌లతో కూడిన భారత జట్టు 228–231 (57–58, 57–58, 57–59, 57–56)తో హజల్‌ బురున్, ఇపెక్‌ తొమ్రుక్, ఇర్మక్‌ యుక్సెల్‌లతో కూడిన తుర్కియే జట్టు చేతిలో ఓడిపోయింది.

ఓజస్‌ ప్రవీణ్‌ దేవ్‌తలె, రిషభ్‌ యాదవ్, ప్రథమేశ్‌లతో కూడిన భారత పురుషుల జట్టుకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించగా... రెండో రౌండ్‌లో 236–228తో ఇండోనేసియా జట్టును ఓడించింది. అనంతరం క్వార్టర్‌ ఫైనల్లో టీమిండియా 231–234తో మెక్సికో జట్టు చేతిలో పరాజయం పాలైంది. పురుషుల రికర్వ్‌ క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ ధీరజ్‌ బొమ్మదేవర 656 పాయింట్లు స్కోరు చేసి 13వ ర్యాంక్‌లో నిలిచాడు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)