ఆర్చరీ ప్రపంచ కప్‌ ఫైనల్‌లో జ్యోతిసురేఖకు కాంస్యం

Published on Sun, 10/19/2025 - 04:07

భారత టాప్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతిసురేఖ మరో కొత్త ఘనతను సొంతం చేసుకుంది.  ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఈవెంట్‌ (కాంపౌండ్‌ విభాగం)లో పతకం నెగ్గిన తొలి భారత మహిళా ఆర్చర్‌గా రికార్డు సృష్టించింది. చైనాలోని నన్‌జింగ్‌లో జరిగిన ఈ పోటీల్లో సురేఖ కాంస్య పతకం గెలుచుకుంది. ఎనిమిది మంది అగ్రశ్రేణి ఆర్చర్లు పాల్గొన్న ఈ పోటీల సెమీఫైనల్లో సురేఖ 143–145 స్కోరుతో వరల్డ్‌ నంబర్‌వన్‌ ఆండ్రియా బెకెరా (మెక్సికో) చేతిలో ఓటమిపాలైంది. 

అయితే కాంస్యం కోసం జరిగిన పోరులో సురేఖ 150–145 తేడాతో వరల్డ్‌ నంబర్‌ 2 ఎలియా గిబ్సన్‌ (గ్రేట్‌ బ్రిటన్‌)పై విజయం సాధించింది. ప్రస్తుత ఆసియా క్రీడల విజేత అయిన సురేఖ 15 బాణాలను ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా పక్కాగా సంధించి అందుబాటులో ఉన్న 150 పాయింట్లనూ సాధించడం విశేషం. 

గతంలో రెండు సార్లు వరల్డ్‌ కప్‌ ఆర్చరీ ఫైనల్‌ (2022, 2023) ఈవెంట్లో పాల్గొన్న సురేఖ పతకం సాధించడంలో విఫలమైంది. మరో వైపు పురుషుల కాంపౌండ్‌ విభాగంలో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత ఆటగాడు రిషభ్‌ యాదవ్‌ అతి స్వల్ప తేడాతో మైక్‌ స్కాలెసర్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో ఓడి పతకాన్ని చేజార్చుకున్నాడు.  

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)