‘ప్రపంచ’ ఆర్చరీ పోటీలకు జ్యోతిసురేఖ, చికిత

Published on Mon, 06/16/2025 - 02:36

పుణే: స్టార్‌ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, బొమ్మదేవర ధీరజ్‌ (ఆంధ్రప్రదేశ్‌), తనిపర్తి చికిత (తెలంగాణ) ప్రపంచ కప్‌ స్టేజ్‌–4 టోర్నీ, ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యారు. భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించిన జాతీయ సెలక్షన్‌ ట్రయల్స్‌లో పలువురు స్టార్‌ ఆర్చర్లకు నిరాశ ఎదురైంది. ఒలింపియన్‌ అతాను దాస్, ప్రపంచ ఏడో ర్యాంకర్‌ అభిషేక్‌ వర్మ, ఈ ఏడాది ప్రపంచకప్‌ టోర్నీల్లో మూడు పతకాలు నెగ్గిన మధుర ట్రయల్స్‌లో విఫలమయ్యారు. 

ఆశ్చర్యకరంగా టీనేజ్‌ ఆర్చర్లు ‘ప్రపంచ’ పోటీలకు అర్హత సాధించడం విశేషం! 15 ఏళ్ల మహారాష్ట్ర ఆర్చర్లు గత ఖడకే, శర్వారీ మహిళల రికర్వ్‌ లో ... 16 ఏళ్ల ప్రీతిక మహిళల కాంపౌండ్‌లో భారత జట్టుకు ఎంపికయ్యారు. మహిళల కాంపౌండ్‌లో జ్యోతి సురేఖ (18.25 పాయింట్లు), పర్ణీత్‌ (14), ప్రీతిక (12.25) వరుసగా  తొలి మూడు స్థానాలు పొందారు. చికిత (12.25) కూడా ప్రీతికతో సమవుజ్జీగా నిలిచినప్పటికీ ‘షూటాఫ్‌’తో చికిత నాలుగో స్థానానికి పరిమితమైంది. 

అయితే ఈ ప్రదర్శనతో ఆమె ప్రపంచకప్‌ ఈవెంట్‌కు అర్హత పొందగా... టాప్‌–3 ప్లేయర్లు రెండు మెగా ఈవెంట్లకూ క్వాలిఫై అయ్యారు. పురుషుల రికర్వ్‌లో అతాను దాస్‌ అర పాయింట్‌ (0.5) తేడాతో ప్రపంచ పోటీలకు దూరమయ్యాడు. ప్రపంచ కప్‌ స్టేజ్‌–4 ఈవెంట్‌ వచ్చే నెల 8 నుంచి 13 వరకు మాడ్రిడ్‌లో జరుగుతుంది. ప్రపంచ చాంపియన్‌ షిప్‌ను సెపె్టంబర్‌ 5 నుంచి 12 వరకు దక్షిణ కొరియాలో నిర్వహిస్తారు.  

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)