Breaking News

అదరగొట్టిన ఆంధ్ర ప్లేయర్లు: భార్గవ్‌కు రెండు టైటిల్స్‌

Published on Mon, 09/02/2024 - 12:33

పుణే: ఇండియా జూనియర్‌ ఇంటర్నేషనల్‌ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారుడు అరిగెల భార్గవ్‌ రామ్‌ రెండు టైటిల్స్‌తో అదరగొట్టాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో గుంటూరు జిల్లాకు చెందిన భార్గవ్‌ అండర్‌–19 పురుషుల డబుల్స్, అండర్‌–19 మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో విజేతగా నిలిచాడు.

డబుల్స్‌లోనూ
పురుషుల డబుల్స్‌ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు చెందిన గొబ్బూరు విశ్వతేజ్‌తో కలిసి ఆడిన భార్గవ్‌ రామ్‌ 21–13, 21–18తో అర్ష్‌ మొహమ్మద్‌–భవ్య్‌ ఛాబ్రా (భారత్‌) జోడీని ఓడించాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భార్గవ్‌రామ్‌–కలగొట్ల వెన్నెల (భారత్‌) ద్వయం 21–9, 21–12తో మొహమ్మద్‌ వితో అనాఫ్సా–కేలా అనీసా పుత్రి (ఇండోనేసియా) జంటను ఓడించి టైటిల్‌ దక్కించుకుంది.

చాంపియన్‌ సూర్య చరిష్మా
ఇక అండర్‌–19 మహిళల సింగిల్స్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన సూర్య చరిష్మా తామిరి చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో సూర్య చరిష్మా 18–21, 21–11, 21–15తో థాలిత రమధాని విర్యావాన్‌ (ఇండోనేసియా)పై గెలుపొందింది. అండర్‌–19 మహిళల డబుల్స్‌ ఫైనల్లో తారిణి సూరి–శ్రావణి వలేకర్‌ (భారత్‌) జంట 21–17, 23–21తో చైచానా–పొలియం (థాయ్‌లాండ్‌) జోడీపై గెలిచి విజేతగా నిలిచింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)