Breaking News

సౌతాఫ్రికా దిగ్గజం సంచ‌ల‌న నిర్ణ‌యం.. 13 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు

Published on Mon, 02/17/2025 - 17:15

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమిని, అతడి భార్య స్యూ విడాకులు తీసుకున్నారు. తమ 13 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు వారిద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గత కొంత కాలంగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై వస్తున్న ఊహాగానాలకు ఎట్టుకేలకు తెరపడింది.

గతేడాది నవంబర్‌ నుంచి డుమిని, స్యూ విడిపోతున్నారని జోరుగా ప్రచారం సాగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో వారి విడాకుల విషయం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలను ఒకొకరు తమ సోషల్ మీడియా ఖాతాలో తొలిగించారు.

అన్నీ ఆలోచించాకే మేము ఇద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మా 12 ఏళ్ల వైవాహిక బంధంలో ఎన్నో మరుపురాని క్షణాలను ఆస్వాదించాము. అంతకమించి మా బంధానికి గుర్తుగా ఇద్దరు కుమార్తెలు జన్మించడం మా అదృష్టం. మా నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరూ గౌరవిస్తారని ఆశిస్తున్నాము.

దయచేసి మా ప్రైవసీకి భంగం కలిగించకండి. మేము ఇద్దరం భార్యాభర్తలుగా విడిపోయినప్పటికి, మంచి స్నేహితులగా కొనసాగుతాము. ఈ సమయంలో మాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఇట్లు మీ జేపీ అండ్ సూ అని ఇద్దరూ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. 

జేపీ డుమిని,స్యూ  2011 లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఇటీవలే దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నాడు. మార్చి 2023లో వైట్ బాల్ ఫార్మాట్ల‌లో ప్రోటీస్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన డుమినీ.. 20 నెల‌ల పాటు ఆ ప‌దవిలో కొన‌సాగాడు.

డుమిని నేతృత్వంలోనే దక్షిణాఫ్రికా టీ20 వరల్డ్‌కప్‌-2024 ఫైనల్‌కు చేరింది.  ఇక కాగా డుమిని 2004- 2019 మధ్యకాలంలో దక్షిణాఫ్రికా తరఫున 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. డుమిని త‌న అంత‌ర్జాతీయ కెరీర్‌లో 9,154 ప‌రుగులు చేశాడు.
చదవండి: ‘జట్టు నుంచి తప్పించారు.. అతడు మాట్లాడేందుకు సిద్ధంగా లేడు.. అందుకే’


 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)