Breaking News

IPL 2025: ప్లే ఆఫ్స్‌కు ముందు ఆర్సీబీకి గుడ్ న్యూస్‌

Published on Tue, 05/20/2025 - 16:58

ఐపీఎల్‌-2025 ప్లే ఆఫ్స్‌కు ముందు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు భారీ ఊర‌ట ల‌భించింది. భుజం గాయంతో బాధ‌ప‌డుతున్న ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్‌, ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్‌ తిరిగి త‌న ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్టాడు.

ఈ ఏడాది సీజ‌న్‌లో ఏప్రిల్ 27న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో హాజిల్‌వుడ్ గాయ‌ప‌డ్డాడు. దీంతో మే 3న సీఎస్‌కేతో జ‌రిగిన మ్యాచ్‌కు ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ దూర‌మ‌య్యాడు. అంత‌లోనే ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్ వారం రోజుల పాటు వాయిదా ప‌డ‌డంతో హాజిల్‌వుడ్ త‌న స్వ‌దేశానికి వెళ్లిపోయాడు.

అత‌డు ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. ఈ క్ర‌మంలో హాజిల్‌వుడ్ తిరిగి భార‌త్‌కు వ‌స్తాడా?  లేదా అన్న సందేహాలు అంద‌రిలో నెల‌కొన్నాయి. డబ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ముందు అత‌డిని భార‌త్‌కు పంపించి క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకోద‌ని వార్త‌లు వ‌చ్చాయి. 

కానీ ఇప్పుడు హాజిల్‌వుడ్ తిరిగి ప్రాక్టీస్ మొద‌లు పెట్ట‌డంతో త్వ‌ర‌లోనే భార‌త్‌కు చేరుకునే అవ‌కాశ‌ముంది. మే 29 నుంచి ప్రారంభ‌మ‌య్యే ప్లేఆఫ్‌ల‌కు హాజిల్‌వుడ్ తిరిగి వ‌స్తాడ‌ని  ఆర్సీబీ వ‌ర్గాలు ధ్రువీకరించాయి. ఈ ఏడాది సీజ‌న్‌లో జోష్ అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు.

ఇప్ప‌టివ‌ర‌కు 10 మ్యాచ్‌లు ఆడిన హాజిల్‌వుడ్ 18 వికెట్లు ప‌డ‌గొట్టి ఆర్సీబీ త‌ర‌పున లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. కాగా ఆర్సీబీ ఇంకా రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలూండ‌గానే ఫ్లే ఆఫ్స్‌కు ఆర్హ‌త సాధించింది. బెంగళూరు జ‌ట్టు త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో మే 23న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో త‌ల‌ప‌డ‌నుంది.


 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)