వెస్టిండీస్‌ టూర్‌కు ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా జోస్‌ బట్లర్‌

Published on Sun, 11/12/2023 - 11:02

వన్డే వరల్డ్‌కప్‌-2023లో దారుణ ప్రదర్శన ప్రదర్శనతో ఇంటుముఖం పట్టిన ఇంగ్లండ్‌.. వచ్చే నెలలో వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ కరేబియన్‌ టూర్‌లో భాగంగా ఆతిథ్య విండీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ తలపడనుంది. ఈ సిరీస్‌ల కోసం రెండు వేర్వేరు జట్లను ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. వన్డే సిరీస్‌కు స్టార్‌ ఆటగాళ్లు బెన్‌స్టోక్స్‌, రూట్‌, మొయిన్‌ అలీలకు ఇంగ్లండ్‌ సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.

యువ పేసర్లు జోస్‌ టాంగ్వే, జాన్‌ టర్నర్‌కు తొలిసారి ఇంగ్లండ్‌ వైట్‌ బాల్‌ జట్టులో చోటు దక్కింది. అదే ఈ రెండు సిరీస్‌లలో ఇంగ్లండ్‌ జట్టు కెప్టెన్‌గా జోస్‌ బట్లర్‌ వ్యవహరించనున్నాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో విఫలమకావడంతో బట్లర్‌ను ఇంగ్లండ్‌ వైట్‌ బాల్‌ కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని ఊహాగానాలు వినిపించాయి.

కానీ ఇంగ్లండ్‌ సెలక్షన్‌ కమిటీ మాత్రం యథావిధిగా జోస్‌నే తమ సారథిగా కొనసాగించింది. డిసెంబర్‌ 3న ఆంటిగ్వా వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఇంగ్లండ్‌ జట్టు కరేబియన్‌ టూర్‌ ప్రారంభం కానుంది.

విండీస్‌తో వన్డేలకు ఇంగ్లండ్‌ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, గుస్ అట్కిన్సన్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జాక్ క్రాలే, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆలీ పోప్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, జాన్ టర్నర్.

విండీస్‌తో టీ20లకు ఇంగ్లండ్‌ జట్టు: జోస్ బట్లర్(కెప్టెన్‌), రెహాన్ అహ్మద్, మోయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్, క్రిస్ వోక్స్

చదవండి: World Cup 2023: భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌.. వర్షం పడితే పరిస్థితి ఏంటి?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)