Breaking News

ఆఖరి నిమిషంలో వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన డేంజ‌ర‌స్ బౌల‌ర్‌

Published on Fri, 11/22/2024 - 19:53

ఐపీఎల్‌-2025 మెగా వేలానికి స‌ర్వం సిద్ద‌మైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా న‌గరంలో నవంబ‌ర్ 24, 25 తేదీల్లో  ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలాన్ని నిర్వ‌హించ‌నున్నారు. అయితే ఆఖరి నిమిషంలో ఈ  మెగా వేలంలోకి ఇంగ్లండ్ స్టార్ ప్లేయ‌ర్ జోఫ్రా ఆర్చర్ ఎంట్రీ ఇచ్చాడు.

ఈ ఆక్ష‌న్ కోసం బీసీసీఐ తొలుత షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో ఆర్చ‌ర్‌కు చోటు ద‌క్క‌లేదు. గ‌త కొంత కాలంగా గాయాల‌తో సత‌మ‌తవుతున్న ఆర్చర్‌కి ఐపీఎల్‌లో ఆడేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తొలుత అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో అత‌డిని బీసీసీఐ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు.

కానీ ఇప్పుడు  ఆర్చర్ ఈసీబీతో చర్చించినట్లు తెలుస్తుంది. అత‌డికి ఐపీఎల్‌లో ఆడేందుకు ఈసీబీ ఎన్‌వోసీ మంజారు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఐపీఎల్ మెగా వేలంలో 576వ ఆటగాడిగా ఆర్చ‌ర్‌ను బీసీసీఐ చేర్చింది.

అయితే భార‌త క్రికెట్ బోర్డు అత‌డి బేస్ ప్రైస్‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు. అత‌డు రూ. 2 కోట్ల క‌నీస ధ‌ర ఉన్న సెట్‌లో ఉండే అవ‌కాశ‌ముంది. ఈ ఇంగ్లండ్‌ ప్రీమియర్‌ బౌలర్‌ గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

ఇక ఆర్చ‌ర్‌తో పాటు యూఎస్ఎ స్టార్ బౌల‌ర్ సౌరభ్ నేత్రావల్కర్, బ‌రోడా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ తమోర్ కూడా వేలం జాబితాలోకి బీసీసీఐ చేర్చింది. మరోవైపు భారత ఆల్‌రౌండర్‌ దీపక్ హుడాను అనుమానిత బౌలింగ్ జాబితాలో బీసీసీఐ చేర్చింది.
చదవండి: IND vs AUS: బ్రో అక్కడ ఉన్నది డీఎస్పీ.. లబుషేన్‌కు ఇచ్చిపడేసిన సిరాజ్! వీడియో

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)