Breaking News

ఐపీఎల్‌-2025 వేలంలో పాల్గొనని ఇద్దరు స్టార్లు..!

Published on Sat, 11/16/2024 - 21:02

ఐపీఎల్‌ 2025 మెగా వేలం సెప్టెంబర్‌ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు వేలం ప్రారంభంకానుంది. ఈసారి వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇందులో 366 మంది భారతీయ ఆటగాళ్లు కాగా.. 208 మంది విదేశీ ఆటగాళ్లు. మరో ముగ్గురు అసోసియేట్‌ దేశాలకు చెందిన వారు. ఈసారి వేలం మొత్తం 204 స్లాట్లకు జరుగనుండగా.. 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది.

ఈసారి మెగా వేలంలో ఇద్దరు స్టార్‌ ప్లేయర్ల పేర్లు కనిపించలేదు. ఇంగ్లండ్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్‌, ఆస్ట్రేలియాకు చెందిన కెమరూన్‌ గ్రీన్‌ వేలంలో తమ పేర్లు నమోదు చేసుకోలేదు. ఆర్చర్‌ జాతీయ జట్టుకు సేవలందించేందుకు వేలానికి దూరంగా ఉండగా.. గ్రీన్‌ సర్జరీ కారణంగా వేలంలో పాల్గొనడం లేదు. ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్‌ 2023 మెగా వేలంలో రూ. 8 కోట్లకు సొంతం చేసుకోగా.. గ్రీన్‌ను ఆర్సీబీ 2024 వేలంలో రూ. 17.5 కోట్లకు దక్కించుకుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈసారి వేలంలో పాల్గొని ఉంటే మరోసారి భారీ మొత్తం దక్కేది.

మెగా వేలంలో పాల్గొనని మరో ముగ్గురు స్లార్లు..
బెన్‌ స్టోక్స్‌
జేసన్‌ రాయ్‌
శిఖర్‌ ధవన్‌

అత్యంత పిన్నవయస్కుడు..
ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్లలో అత్యంత పిన్న వయస్కుడు వైభవ్‌ సూర్యవంశీ. 13 ఏళ్ల ఈ బీహార్‌ చిన్నోడు జూనియర్‌ క్రికెట్‌లో సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్శించాడు. ఇక వేలంలో పాల్గొనబోయే అత్యంత పెద్ద వయస్కుడిగా జిమ్మీ ఆండర్సన్‌ ఉన్నాడు. ఆండర్సన్‌ 41 ఏళ్ల వయసులో వేలంలో పాల్గొని తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

వేలంలో పాల్గొనబోయే ఆసోసియేట్‌ దేశాలకు చెందిన ఆటగాళ్లు..

ఉన్ముక్త్‌ చంద్‌ (యూఎస్‌ఏ)
అలీ ఖాన్‌ (యూఎస్‌ఏ)
బ్రాండన్‌ మెక్‌ముల్లెన్‌ (స్కాట్లాండ్‌)

ఈ ముగ్గురు 30 లక్షల బేస్‌ప్రైజ్‌ విభాగంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

క్యాప్డ్‌, అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ల వివరాలు..

భారతీయ క్యాప్డ్‌ ప్లేయర్లు- 48
విదేశీ క్యాప్డ్‌ ప్లేయర్లు- 193
అసోసియేట్‌ దేశాలకు చెందిన ప్లేయర్లు- 3
భారతీయ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు- 318
విదేశీ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు- 12
మొత్తం- 574

వివిధ బేస్‌ ధర విభాగాల్లో పాల్గొననున్న ఆటగాళ్లు..

రూ. 2 కోట్లు- 81 మంది ఆటగాళ్లు
రూ. 1.5 కోట్లు- 27
రూ. 1.25 కోట్లు- 18


రూ. కోటి- 23
రూ. 75 లక్షలు- 92
రూ. 50 లక్షలు- 8
రూ. 40 లక్షలు- 5
రూ. 30 లక్షలు- 320
మొత్తం- 574

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)