Breaking News

టీమిండియా మాజీ బౌలర్‌కు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక కమిటీలో చోటు

Published on Tue, 06/27/2023 - 09:36

లండన్‌: ప్రతిష్టాత్మక మెరిలిబోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) వరల్డ్‌ క్రికెట్‌ కమిటీలో భారత మాజీ పేసర్‌ జులన్‌ గోస్వామికి స్థానం లభించింది. ఆమెతో పాటు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌లు ఇయాన్‌ మోర్గాన్, హీతర్‌ నైట్‌లను కూడా కమిటీలోకి తీసుకున్నట్లు ఎంసీసీ చైర్మన్‌ మైక్‌ గ్యాటింగ్‌ వెల్లడించారు. క్రికెట్‌ నిబంధనలు రూపొందించే ఎంసీసీలో భాగమైన వరల్డ్‌ క్రికెట్‌ కమిటీ కొత్తగా వచ్చే సాంకేతిక అంశాలను, వాటిని ఉపయోగించడానికి సంబంధించి తగిన సూచనలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఎంసీసీ ప్రధాన కేంద్రం లార్డ్స్‌ మైదానంలో ఉంది. లార్డ్స్‌లోనే జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లలో 2019 వన్డే వరల్డ్‌ కప్, 2017 వన్డే వరల్డ్‌ కప్‌లలో ఇంగ్లండ్‌ విజేతగా నిలిచింది. ఈ టీమ్‌లకు మోర్గాన్, హీతర్‌ నైట్‌ కెప్టెన్లుగా వ్యవహరించారు. గత ఏడాది ఇదే లార్డ్స్‌ మైదానంలో తన ఆఖరి వన్డే ఆడి జులన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. ఓవరాల్‌గా మూడు ఫార్మాట్‌లలో కలిపి 355 వికెట్లు పడగొట్టిన జులన్‌కు ఈ ఏడాదే ఎంసీసీ గౌరవ సభ్యత్వం దక్కింది.   

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)