Breaking News

భారత్‌ నుంచి ఒక్క ప్లేయరే.. ఆ జట్టుతోనే జెమీమా! లిస్ట్‌ ఇదే..

Published on Fri, 06/20/2025 - 13:16

Drafted players for WBBL 2025: భారత మహిళల క్రికెట్‌ జట్టు సభ్యురాలు జెమీమా రోడ్రిగ్స్‌ను మహిళల బిగ్‌ బాష్‌ లీగ్‌ (WBBL) ఫ్రాంచైజీ బ్రిస్బేన్‌ హీట్‌ తిరిగి తీసుకుంది. ఈ ఏడాది జరగనున్న డబ్ల్యూబీబీఎల్‌ 10వ సీజన్‌ కోసం భారత్‌ నుంచి 15 మంది ప్లేయర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు ఒక్క జెమీమా మాత్రమే తిరిగి బీబీఎల్‌లో ఆడటం ఖరారైంది. 

కాగా గురువారం జరిగిన ప్లేయర్ల డ్రాఫ్టింగ్‌లో లీగ్‌లోని మొత్తం 8 ఫ్రాంఛైజీలు 23 మంది అంతర్జాతీయ ప్లేయర్లను ఎంపిక చేసుకున్నాయి. జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు చినెల్లి హెన్రీ (వెస్టిండీస్‌), డి క్లెర్క్‌ (దక్షిణాఫ్రికా)ను బ్రిస్బేన్‌ ఫ్రాంచైజీ ఎంపిక చేసుకుంది.

‘అభిమానులను ఆకట్టుకోగల సత్తా జెమీమాకు ఉంది’ అని బ్రిస్బేన్‌ హీట్‌ యాజమాన్యం వ్యాఖ్యానించింది. జెమీమాకిది నాలుగో బిగ్‌బాష్‌ లీగ్‌ సీజన్‌ కానుంది. 2021–2022 సీజన్‌లో మెల్‌బోర్న్‌ రెనెగెడ్స్‌ తరఫున... 2022–2023 సీజన్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ తరఫున... 2024–2025 సీజన్‌లో బ్రిస్బేన్‌ హీట్‌ తరఫున జెమీమా ఆడింది. ఓవరాల్‌గా బిగ్‌బాష్‌ లీగ్‌లో జెమీమా 30 మ్యాచ్‌లు ఆడి 644 పరుగులు చేసింది. ఇందులో మూడు అర్ధ సెంచరీలున్నాయి.

మరోవైపు.. శ్రీలంక కెపె్టన్‌ చమరి ఆటపట్టు, షబ్నమ్‌ ఇస్మాయిల్‌ (దక్షిణాఫ్రికా), హీథెర్‌ నైట్‌ (ఇంగ్లండ్‌)ను సిడ్నీ థండర్‌ జట్టు తీసుకుంది. సోఫియా డంక్లీ, మ్యాడీ విలియర్స్‌ (ఇంగ్లండ్‌), అమేలియా కెర్‌ (న్యూజిలాండ్‌)ను సిడ్నీ సిక్సర్స్‌ జట్టు తీసుకుంది. 

సోఫీ ఎకిల్‌స్టోన్, టామీ బ్యూమాంట్‌ (ఇంగ్లండ్‌) , లౌరా వాల్వర్డ్‌ (దక్షిణాఫ్రికా)ను అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ ఎంపిక చేసుకోగా... అమీ జోన్స్, డానీ గిబ్సన్‌ (ఇంగ్లండ్‌), మరిజాన్‌ కాప్‌ (దక్షిణాఫ్రికా)ను మెల్‌బోర్న్‌ స్టార్స్‌ జట్టు ఎంపిక చేసుకుంది. సోఫీ డివైన్‌ (న్యూజిలాండ్‌), స్కోల్‌ఫీల్డ్‌ (ఇంగ్లండ్‌), చ్లో ట్రియాన్‌ (దక్షిణాఫ్రికా) పెర్‌ స్కోచెర్స్‌ జట్టుకు ఎంపికయ్యారు. 

ఇక డానియల్‌ వ్యాట్, లినెస్సీ స్మిత్‌ హోబర్ట్‌ హరికేన్స్‌కు ప్రాతినిధ్యం వహించనుండగా... మెల్‌బోర్న్‌ రెనెగెడ్స్‌ తరఫున డియాండ్రా డాటిన్, అలీస్‌ కాప్సీ బరిలోకి దిగనున్నారు.

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)