Breaking News

ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా జెమీమా

Published on Wed, 12/24/2025 - 04:13

న్యూఢిల్లీ: టీమిండియా బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా ఎంపికైంది. భారత జట్టు తొలిసారి ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన జెమీమాకు ఢిల్లీ జట్టు పగ్గాలు అప్పగిస్తన్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో జెమీమా వీరోచిత సెంచరీ సాధించడంతో టీమిండియా ఆ్రస్టేలియాపై విజయం సాధించింది. 

‘ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనుండటం గౌరవంగా భావిస్తున్నా. నా మీద నమ్మకముంచిన జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఈ ఏడాది నాకు ఎంతో బాగా సాగింది. వరల్డ్‌కప్‌ గెలిచిన ఆనందంలో ఉన్న సమయంలోనే ఈ వార్త నా సంతోషాన్ని రెట్టింపు చేసింది. మూడేళ్లుగా ఇదే జట్టుతో సాగుతున్నా. ఎంతో నేర్చుకున్నా. గత మూడు సార్లు ఫైనల్‌ చేరినా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయాం. ఈ సారి ఆ గెలుపు గీత దాటుతాం’అని జెమీమా పేర్కొంది. 

డబ్ల్యూపీఎల్‌ ఆరంభం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కే ప్రాతినిధ్యం వహిస్తున్న జెమీమా... 27 మ్యాచ్‌లాడి 139.67 స్ట్రయిక్‌ రేట్‌తో 507 పరుగులు చేసింది. లీగ్‌లో ఇప్పటి వరకు మూడుసార్లు ఢిల్లీ జట్టు ఫైనల్‌కు చేరగా... మూడింట్లోనూ జెమీమా ఆడింది. గతంలో ఢిల్లీ జట్టుకు మెగ్‌ లానింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరించింది. వచ్చే ఏడాది జరగనున్న డబ్ల్యూపీఎల్‌లో తమ తొలి మ్యాచ్‌లో జనవరి 10న ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)