Breaking News

Jay Shah: ఐసీసీ తదుపరి చైర్మన్‌గా జైషా?

Published on Tue, 07/09/2024 - 13:11

బీసీసీఐ సెక్రటరీ జై షా అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) చైర్మెన్‌ పదవిపై క‌న్నేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న ఐసీసీ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో జై షా  పోటీచేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఐసీసీ నిర్వహణలో ఆయన సమూల మార్పులు తీసుకురావాలని భావిస్తున్న‌ట్లు క్రిక్‌బ‌జ్ త‌మ క‌థ‌నంలో పేర్కొంది. 

ప్ర‌స్తుతం ఐసీసీ ఛైర్మన్‌గా గ్రెగ్‌ బార్క్‌లే గ‌త‌ నాలుగు సంవత్సరాలుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. అతడు మరో మారు  ఛైర్మన్‌గా కొనసాగడానికి అర్హత ఉంది. కానీ చైర్మెన్ ప‌ద‌విపై జై షా పదవిపై ఆసక్తిగా ఉండటంతో  గ్రెగ్‌ బార్క్‌లే పోటీ నుంచి తప్పుకోనున్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది. 

కాగా గ్రెగ్‌ బార్క్‌లే  జై షా మద్దతుతోనే ఐసీసీ ఛైర్మన్ కావడం గమనార్హం. అయితే టీ20 వరల్డ్‌కప్‌-2024 ముందు వరకు జై షా బీసీసీఐ సెక్రటరీ, ఐసీసీ చైర్మెన్‌గానే కొనసాగించాలని భావించండట. కానీ  ఇటీవల అమెరికా, వెస్టిండీస్  వేదికగా ముగిసిన టీ20 ప్రపంచ కప్‌ఆతిథ్యం, నిర్వహణపై విమర్శలు రావడంతో జై షా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ క్రమంలోనే ఐసీసీ బాస్‌గా జై షా బాధ్యతలు చేపట్టనున్నట్లు వినికిడి. ఇక వేళ జై షా ఐసీసీ చైర్మెన్‌గా బాధ్యతలు చేపడితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్, బీసీసీఐ సెక్రటరీ పదవులను వదులుకోవాల్సి ఉంటుంది.

కాగా 2019లో బీసీసీఐ కార్యదర్శిగా జైషా పగ్గాలు చేపట్టాడు. అంతకంటే ముందు గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీగా కూడా జైషా పనిచేశాడు. అదే విధంగా 2021లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)