Breaking News

అదొక చెత్త క్రికెట్‌ బోర్డు.. అందుకే రాజీనామా: ఆసీస్‌ దిగ్గజం

Published on Mon, 12/16/2024 - 17:18

పాకిస్తాన్ టెస్టు జ‌ట్టు హెడ్‌కోచ్ ప‌దవి నుంచి ఆసీస్ దిగ్గ‌జం జాసన్ గిల్లెస్పీ వైదొలిగిన సంగ‌తి తెలిసిందే.  ద‌క్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు గిల్లెస్పీ త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించి అంద‌రికి షాకిచ్చాడు. అయితే తాజాగా త‌న రాజీనామాపై గిల్లెస్పీ స్పందించాడు. అసిస్టెంట్  కోచ్ టిమ్ నీల్సన్‌ను తన పదవి నుంచి పీసీబీ తప్పించడంతో తన కూడా వైదొలగాల్సి వచ్చిందని గిల్లెస్పీ చెప్పుకొచ్చాడు. 

అదే విధంగా ప్ర‌పంచంలో పీసీబీ లాంటి క్రికెట్ బోర్డును త‌నకెక్క‌డా చూడ‌లేద‌ని గిల్లెస్పీ విమ‌ర్శ‌లు గుప్పించాడు. కాగా హెడ్ కోచ్ గ్యారీ కిరెస్టన్‌ వైదొలిగిన అనంతరంహెడ్ కోచ్‌గా జాసన్ గిలెస్పీని పీసీబీ నియమించింది. అత‌డి నేతృత్వంలోనే పాకిస్తాన్ క్రికెట్ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. 

"పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి క్రికెట్‌ బోర్డును నేను ఇప్పటివరకు చూడలేదు. ఏ హెడ్ కోచ్ అయినా త‌మ బోర్డుతో మంచి సంబంధాలు క‌లిగిండాల‌ని భావిస్తాడు. కానీ పీసీబీ తీరు మాత్రం అందుకు భిన్నం. వారికి నాకు స‌మ‌న్వ‌య లోపం ఏర్ప‌డింది. తుది జ‌ట్టు ఎంపిక విష‌యంలో కూడా నాకు పూర్తి స్వేఛ్చ లేదు. 

అందులో కూడా పీసీబీ జోక్యం చేసుకుంటుంది. సెల‌క్ట‌ర్ల‌తో కూడా నాకు స‌రైన క‌మ్యూనికేష‌న్ లేదు. సీనియర్ అసిస్టెంట్ కోచ్ టిమ్ నీల్సన్‌ను నాకు కనీసం సమాచారం ఇవ్వకుండానే తప్పించారు. ఇదొక్కటే కాదు గ‌త కొన్ని నెల‌ల‌గా వారితో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. 

అయినప్ప‌టికి వారితో కొన‌సాగాను. ఎప్పుడైతే నీల్స్‌ను నాకు కనీసం స‌మాచారం ఇవ్వ‌కుండా తొలిగించారో అప్పుడే నేను కూడా గుడ్‌బై చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నాను" అని గిల్లెస్పీ పేర్కొన్నాడు.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)