Breaking News

విన్నర్‌ సినెర్‌

Published on Mon, 07/14/2025 - 04:16

లండన్‌: పచ్చిక కోర్టులపై తన ప్రతాపాన్ని చూపిన ఇటలీ స్టార్, ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ ‘వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌’ చాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సినెర్‌ 4–6, 6–4, 6–4, 6–4తో డిఫెండింగ్‌ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌)ను ఓడించాడు. విజేతగా నిలిచిన సినెర్‌కు 30 లక్షల పౌండ్లు (రూ. 34 కోట్ల 85 లక్షలు), రన్నరప్‌ అల్‌కరాజ్‌కు 15 లక్షల 20 వేల పౌండ్లు (రూ. 17 కోట్ల 66 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 

3 గంటల 4 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో గెలవడం ద్వారా గత నెలలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో అల్‌కరాజ్‌ చేతిలో ఎదురైన ఓటమికి 23 ఏళ్ల సినెర్‌ బదులు తీర్చుకున్నాడు. అంతేకాకుండా తన కెరీర్‌లో తొలిసారి వింబుల్డన్‌ టైటిల్‌ను సాధించాడు. ఓవరాల్‌గా సినెర్‌ ఖాతాలో ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కావడం విశేషం. 

సినెర్‌ 2024, 2025లలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌... 2024లో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించాడు. సినెర్‌ చేతిలో ఓటమితో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో అల్‌కరాజ్‌కు తొలిసారి పరాజయం ఎదురైంది. ఈ మ్యాచ్‌కంటే ముందు 22 ఏళ్ల అల్‌కరాజ్‌ ఫైనల్‌ చేరిన ఐదు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లోనూ (2022 యూఎస్‌ ఓపెన్‌; 2023 వింబుల్డన్‌; 2023 ఫ్రెంచ్‌ ఓపెన్‌; 2024 వింబుల్డన్‌; 2025 ఫ్రెంచ్‌ ఓపెన్‌) విజేతగా నిలిచాడు.  

తొలి సెట్‌ కోల్పోయినా... 
గతంలో అల్‌కరాజ్‌ చేతిలో ఎనిమిదిసార్లు ఓడిపోయి, నాలుగుసార్లు మాత్రమే నెగ్గిన సినెర్‌ వింబుల్డన్‌ ఫైనల్లో శుభారంభం చేయలేకపోయాడు. తొలి సెట్‌లో 4–2తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ... అల్‌కరాజ్‌ ధాటికి సినెర్‌ వరుసగా నాలుగు గేమ్‌లు కోల్పోయి సెట్‌ను 4–6తో చేజార్చుకున్నాడు. తొలి సెట్‌ను కోల్పోయినా... ఆందోళన చెందకుండా సంమయనంతో ఆడిన సినెర్‌ రెండో సెట్‌లో తొలి గేమ్‌లోనే అల్‌కరాజ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. 

ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని సెట్‌ను 6–4తో నెగ్గి 1–1తో సమం చేశాడు. మూడో సెట్‌లోని తొమ్మిదో గేమ్‌లో అల్‌కరాజ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి పదో గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకున్న సినెర్‌ సెట్‌ను 6–4తో దక్కించుకున్నాడు. నాలుగో సెట్‌లోనూ సినెర్‌ దూకుడు కొనసాగించి మూడో గేమ్‌లో అల్‌కరాజ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌తోపాటు విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు