Breaking News

ఆస్ట్రేలియా ఓపెన్ ఫైన‌ల్‌కు చేరిన సిన్న‌ర్‌..

Published on Fri, 01/24/2025 - 19:16

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మెన్స్ సింగిల్స్‌ ఫైన‌ల్లో డిఫెండింగ్ ఛాంపియన్, వ‌ర‌ల్డ్ టెన్నిస్ నెం1 జానిక్ సిన్నర్(Jannik Sinner) అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన సెమీఫైన‌ల్లో అమెరికా టెన్నిస్ ఆట‌గాడు బెన్ షెల్టాన్‌ను 7-6(7/2), 6-2, 6-2 తేడాతో ఓడించిన సిన్న‌ర్‌.. వ‌రుస‌గా రెండో సారి త‌న ఫైన‌ల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్నాడు.

అంత‌కుముందు జ‌రిగిన మ‌రో సెమీఫైన‌ల్లో గాయం కార‌ణంగా సెర్బియా టెన్నిస్ దిగ్గ‌జం నొవాక్ జొకోవిచ్(Novak Djokovic) గాయం కార‌ణంగా త‌ప్ప‌కోవ‌డంతో రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) ఫైన‌ల్‌కు చేరాడు. ఈ క్ర‌మంలో ఆదివారం(జనవరి 27) జరగనున్న ఫైనల్ పోరులో జానిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరెవ్ పోటీపడనున్నారు.

కాగా ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న జానిక్ సిన్నర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ ఫైనల్స్‌కు వరుసగా రెండో సారి ఆర్హత సాధించిన తొలి ఇటాలియన్ టెన్నిస్‌ ప్లేయర్‌గా సిన్నర్‌​ నిలిచాడు.

గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌, యూఎస్ ఓపెన్‌లను సొంతం చేసుకున్న సిన్నర్‌.. నోవాక్ జొకోవిచ్ వెనక్కి నెట్టి నెం1 ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. మెన్స్ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో సిన్నర్ ప్రస్తుతం అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు.
చదవండి: Australian Open 2025: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి జొకొవిచ్‌ అవుట్‌.. కారణం ఇదే!

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)