Breaking News

సినెర్‌... కొత్త నంబర్‌వన్‌

Published on Tue, 06/11/2024 - 04:27

పారిస్‌: ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇటలీ టెన్నిస్‌ ప్లేయర్‌ యానిక్‌ సినెర్‌ తన కెరీర్‌లో గొప్ప ఘనత సాధించాడు. అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సినెర్‌ ఒక స్థానం మెరుగుపర్చుకొని 9,525 పాయింట్లతో నంబర్‌వన్‌ స్థానానికి చేరుకున్నాడు. 

టెన్నిస్‌లో కంప్యూటర్‌ ఆధారిత ర్యాంకింగ్స్‌ (1973 నుంచి) మొదలయ్యాక వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ అందుకున్న తొలి ఇటలీ ప్లేయర్‌గా 22 ఏళ్ల సినెర్‌ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది సినెర్‌ 33 మ్యాచ్‌ల్లో గెలిచి, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. 

ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తోపాటు మయామి మాస్టర్స్‌ సిరీస్, రోటర్‌డామ్‌ ఓపెన్‌లో అతను విజేతగా నిలిచాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీఫైనల్లో ఓడిపోయాడు. గతవారం వరకు టాప్‌ ర్యాంక్‌లో ఉన్న సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ రెండు స్థానాలు పడిపోయి మూడో ర్యాంక్‌లో నిలిచాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన కార్లోస్‌ అల్‌కరాజ్‌ ఒక స్థానం పురోగతి సాధించి రెండో ర్యాంక్‌లో నిలిచాడు.  

కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో నగాల్‌ 
భారత టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ నగాల్‌ కెరీర్‌ బెస్ట్‌ 77వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆదివారం జర్మనీలో జరిగిన నెకర్‌ కప్‌ టోరీ్నలో విజేతగా నిలిచిన సుమిత్‌ 18 స్థానాలు పురోగతి సాధించాడు. తాజా ర్యాంక్‌ కారణంగా సుమిత్‌ వచ్చే నెలలో జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో సింగిల్స్‌ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ఖాయమైంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)