Breaking News

సినెర్‌దే షాంఘై మాస్టర్స్‌ టైటిల్‌

Published on Mon, 10/14/2024 - 08:41

షాంఘై: ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకర్‌ జానిక్‌ సినెర్‌ ఈ ఏడాది టైటిళ్లతో దూసుకెళుతున్నాడు. చైనాలో జరిగిన షాంఘై మాస్టర్స్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఇటాలియన్‌ స్టార్‌ ప్లేయర్‌ వరుస సెట్లలోనే టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌కు షాకిచ్చాడు. ఫైనల్లో సినెర్‌ 7–6 (7/4), 6–3తో 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత, సెర్బియన్‌ సూపర్‌స్టార్‌ జొకొవిచ్‌ను కంగు తినిపించాడు. కేవలం గంటా 37 నిమిషాల్లోనే సినెర్‌ ఈ టైటిల్‌ పోరును ముగించడం విశేషం. సినెర్‌ 8 ఏస్‌లను సంధించి, 22 విన్నర్లు కొట్టాడు. 

మరోవైపు అంచనాలకు తగినట్లుగా ఆడలేకపోయిన నొవాక్‌ 4 ఏస్‌లు, 12 విన్నర్లే కొట్టగలిగాడు. దీంతో కెరీర్‌లో వందో టైటిల్‌ సాధించాలన్న సెర్బియన్‌ ఆశలు ఆవిరయ్యాయి. పురుషుల టెన్నిస్‌ చరిత్రలో ఇద్దరే ఆటగాళ్లు అమెరికన్‌ లెజెండ్‌ జిమ్మీ కానర్స్‌ 109, స్విట్జర్లాండ్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ రోజర్‌ ఫెడరర్‌ 103 టైటిళ్లతో సెంచరీ మార్క్‌ను దాటారు. ఈ ఏడాది సూపర్‌ ఫామ్‌లో ఉన్న 23 ఏళ్ల సినెర్‌ హార్డ్‌కోర్ట్‌లో టాప్‌–5 ప్లేయర్లపై తన విజయాల ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నాడు.

 ప్రపంచ టాప్‌ ఐదు ర్యాంక్‌ ప్లేయర్లపై 8 సార్లు గెలిచిన సినెర్‌ కేవలం రెండు సార్లు మాత్రమే ఓడిపోయాడు. ఐదేళ్ల తర్వాత షాంఘై బరిలోకి దిగిన 37 ఏళ్ల జొకోవిచ్‌ చివరకు రన్నరప్‌గానే సరిపెట్టుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో జరిగిన వుహాన్‌ ఓపెన్‌లో వరుసగా మూడోసారి బెలారస్‌ స్టార్‌ అరియాన సబలెంక హ్యాట్రిక్‌ టైటిల్‌ను సాధించింది. ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ సబలెంక 6–3, 7–5, 6–3తో స్థానిక చైనా స్టార్‌ జెంగ్‌ కిన్వెన్‌ను కంగుతినిపించింది. ఈ సీజన్‌లో బెలారస్‌ టెన్నిస్‌ స్టార్‌కిది నాలుగో టైటిల్‌. ఆమె గ్రాండ్‌స్లామ్‌ ఈవెంట్లలో ఆ్రస్టేలియన్, యూఎస్‌ ఓపెన్‌ టైటిళ్లను కూడా గెలుచుకుంది.

 

Videos

భయపడేవాడు ఎవడూ లేడు... కోయ ప్రవీణ్.. ఖాకీ డ్రెస్ బదులు టీడీపీ జెండా కట్టుకో

RC 17 పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

ఏపీలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?

ధరల పెరుగుదలపై లోకేష్‌కు వరుదు కళ్యాణి సవాల్..!

మీకో దండం... మీ మీద నమ్మకం లేదు స్వామి సెక్యూరిటీ అని చెప్పి మమ్మల్ని...

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్