జొకోవిచ్‌ పరాజయం

Published on Sat, 07/11/2026 - 00:57

లండన్‌: కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ సాధించాలని ఆశిస్తున్న సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ టోర్నీలో ఏడుసార్లు చాంపియన్‌ జొకోవిచ్‌ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. డిఫెండింగ్‌ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ వరుస సెట్‌లలో 6–4, 6–4, 6–4తో జొకోవిచ్‌ను ఓడించి వరుసగా రెండో ఏడాది ఫైనల్లోకి ప్రవేశించాడు.

2 గంటల 20 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సినెర్‌ 16 ఏస్‌లు సంధించాడు. మూడుసార్లు జొకోవిచ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. ఆదివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)తో సినెర్‌ తలపడతాడు. మరో సెమీఫైనల్లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ జ్వెరెవ్‌ 2 గంటల 14 నిమిషాల్లో 7–6 (7/0), 6–2, 6–4తో ‘వైల్డ్‌ కార్డు’ ప్లేయర్‌ ఆర్థర్‌ ఫెరీ (బ్రిటన్‌)పై గెలిచాడు. 

ఈ క్రమంలో తొమ్మిదో ప్రయత్నంలో జ్వెరెవ్‌ తొలిసారి వింబుల్డన్‌ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ విజయంతో జ్వెరెవ్‌ కెరీర్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో... ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీలో... ఒలింపిక్స్‌లో ఫైనల్‌ చేరుకున్న ఏడో ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో ఆండ్రీ అగస్సీ, రోజర్‌ ఫెడరర్, రాఫెల్‌ నాదల్, జొకోవిచ్, ఆండీ ముర్రే, అల్‌కరాజ్‌ ఉన్నారు.  

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)