Breaking News

23 ఏళ్ల తర్వాత...

Published on Mon, 11/03/2025 - 03:03

చెన్నై: అంచనాలకు మించి రాణించిన ఇండోనేసియా క్రీడాకారిణి జనిస్‌ జెన్‌ తన కెరీర్‌లో తొలి మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ)–250 టూర్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఎంజెలిక్‌ విద్జాజా (2002లో పట్టాయా ఓపెన్‌) తర్వాత డబ్ల్యూటీఏ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన ఇండోనేసియా క్రీడాకారిణిగా జనిస్‌ గుర్తింపు పొందింది. ఆదివారం ముగిసిన చెన్నై ఓపెన్‌ డబ్ల్యూటీఏ–250 టోర్నీలో ప్రపంచ 82వ ర్యాంకర్‌ జనిస్‌ జెన్‌ విజేతగా అవతరించింది. 

రెండు గంటలపాటు జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్‌ జనిస్‌ జెన్‌ 6–3, 6–4తో ఏడో సీడ్‌ కింబర్లీ బిరెల్‌ (ఆ్రస్టేలియా)పై  నెగ్గింది. విజేతగా నిలిచిన జనిస్‌ జెన్‌కు 36,300 డాలర్ల (రూ. 32 లక్షల 26 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి విన్నర్, రన్నరప్‌లకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్, భారత టెన్నిస్‌ దిగ్గజం విజయ్‌ అమృత్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.  

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)