Breaking News

‘704’తో ముగించిన అండర్సన్‌

Published on Sat, 07/13/2024 - 07:10

లండన్‌: 21 సంవత్సరాల టెస్టు కెరీర్‌... 188 మ్యాచ్‌లు...40,007 బంతులు...704 వికెట్లు...26.45 సగటు...ఘనమైన ఆటకు ముగింపు లభించింది. టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ కెరీర్‌కు తెర పడింది. శుక్రవారం వెస్టిండీస్‌తో ముగిసిన తొలి టెస్టుతో అతను ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 

2003 మే 22–24 మధ్య ఇదే లార్డ్స్‌ మైదానంలో తొలి టెస్టు ఆడిన అండర్సన్‌ అక్కడే ఆటకు వీడ్కోలు పలికాడు. విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో తన 12వ ఓవర్లో జోషువా డి సిల్వాను కీపర్‌ క్యాచ్‌ ద్వారా అవుట్‌ చేయడంతో అండర్సన్‌ ఖాతాలో చివరిదైన 704వ వికెట్‌ చేరింది. టెస్టుల్లో మురళీధరన్‌ (800 వికెట్లు), షేన్‌ వార్న్‌ (708 వికెట్లు) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా... సచిన్‌ టెండూల్కర్‌ (200) తర్వాత అత్యధిక టెస్టులు ఆడిన రెండో ఆటగాడిగా ఈ దిగ్గజం సొంత అభిమానుల సమక్షంలో మైదానం వీడాడు.

 మూడో రోజే ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్, 114 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 79/6తో ఆట కొనసాగించిన విండీస్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూలింది. 12.1 ఓవర్లలో ఆ జట్టు మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. గుడకేశ్‌ మోతీ (31 నాటౌట్‌) మాత్రమే కొద్దిగా పోరాడగలిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో అట్కిన్సన్‌ (5/61) విండీస్‌ను దెబ్బ తీశాడు. రెండో టెస్టు గురువారం నుంచి నాటింగ్‌హామ్‌లో జరుగుతుంది.  

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు