Breaking News

అండర్సన్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. 22 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై!

Published on Sat, 05/11/2024 - 17:25

ఇంగ్లండ్ లెజెండ‌రీ పేస‌ర్‌ జేమ్స్ ఆండ‌ర్స‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఆండ‌ర్స‌న్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఇప్ప‌టికే వన్డేలు, టీ20ల నుంచి త‌ప్పుకున్న ఆండ‌ర్స‌న్‌..  ఈ వేసవి సీజన్‌తో టెస్టు క్రికెట్ నుంచి కూడా త‌ప్పుకోనున్నాడు. 

ఈ ఏడాది జూలైలో లార్డ్స్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగే తొలి టెస్టు అనంత‌రం త‌న  22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు ప‌ల‌కున్న‌ట్లు ఆండ‌ర్స‌న్ ప్ర‌క‌టించాడు. ఈ విష‌యాన్ని శ‌నివారం సోష‌ల్ మీడియా వేదిక‌గా 41 ఏళ్ల ఆండర్స‌న్ వెల్ల‌డించాడు.

"ఈ వేస‌విలో లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో జరిగే మొదటి టెస్ట్ నా చివ‌రి టెస్టు మ్యాచ్‌. 20 ఏళ్లకు పైగా నా దేశానికి అత్యున్న‌త స్ధాయిలో ప్రాతినిథ్యం వ‌హించ‌డం చాలా గ‌ర్వంగా ఉంది. నేను ఎంతో ఇష్ట‌ప‌డే ఆట‌కు విడ్కోలు ప‌లుకుతుండ‌డం చాలా బాధగా ఉంది.  

కుర్రాళ్లకు అవ‌కాశాలు ఇవ్వాల‌ని ఉద్దేశ్యంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నాను. నా ఈ ప్ర‌యాణంలో మ‌ద్దతుగా నిలిచిన ఇంగ్లండ్ క్రికెట్‌కు ,అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలంటూ" ఇన్‌స్టాగ్రామ్‌లో జేమ్స్ రాసుకొచ్చాడు. 

ఇక ఆండ‌ర్స‌న్‌కు వ‌ర‌ల్డ్‌క్రికెట్‌లో ప్ర‌త్యేక‌మైన స్ధానం ఉంది. 41 ఏళ్ల ఆండ‌ర్స‌న్ టెస్టుల్లో 700 వికెట్లు తీసిన ఏకైక బౌల‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 187 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఓవ‌రాల్‌గా 400 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆండ‌ర్స‌న్ 987 వికెట్లు ప‌డగొట్టాడు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)