Breaking News

రజతంతో వీడ్కోలు

Published on Mon, 09/22/2025 - 04:08

టోక్యో: తన 17 ఏళ్ల అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ కెరీర్‌కు జమైకా దిగ్గజం షెల్లీ ఆన్‌ ఫ్రేజర్‌ ప్రైస్‌ ఘనంగా ముగింపు పలికింది. ఆదివారం ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో చివరిసారి ట్రాక్‌పై బరిలోకి దిగిన 38 ఏళ్ల షెల్లీ మహిళల 4–100 మీటర్ల రిలే విభాగంలో జమైకా బృందానికి రజత పతకం అందించింది. షెల్లీ, టియా క్లేటన్, టీనా క్లేటన్, జొనెల్లీ స్మిత్‌లతో కూడిన జమైకా బృందం 41.79 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచింది. 

100 మీటర్లు, 200 మీటర్ల వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచిన అమెరికా స్టార్‌ మెలిస్సా జెఫర్సన్‌ వుడెన్‌ తన ఖాతాలో మూడో స్వర్ణ పతకాన్ని జమ చేసుకుంది. మెలిస్సా, ట్వానిషా టెర్రీ, కేలా వైట్, షకారి రిచర్డ్‌సన్‌లతో కూడిన అమెరికా రిలే జట్టు 41.75 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. 

సినా మేయర్, రెబెకా హాస్, సోఫియా జంక్, గినా లుకెన్‌కెంపర్‌లతో కూడిన జర్మనీ జట్టుకు కాంస్య పతకం లభించింది. 2008 నుంచి అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో ఉన్న షెల్లీ తన కెరీర్‌లో 8 ఒలింపిక్‌ పతకాలు (4 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యం) గెల్చుకుంది. ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 17 పతకాలు (10 స్వర్ణాలు, 6 రజతాలు, 1 కాంస్య) సొంతం చేసుకుంది.  

అమెరికాదే అగ్రస్థానం 
ఆదివారంతో ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో మరోసారి అమెరికా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అమెరికా 16 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. 7 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు నెగ్గిన కెన్యా 11 పతకాలతో రెండో స్థానంలో... 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం నెగ్గిన కెనడా ఐదు పతకాలతో మూడో స్థానంలో నిలిచాయి. ఓవరాల్‌గా 54 దేశాలు కనీసం ఒక కాంస్య 
పతకాన్ని సాధించాయి.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)