Breaking News

37 ఏళ్ల వయస్సులో అద్బుతం.. ఏకంగా 9 వికెట్లు! సంజూ ఫుల్‌ హ్యాపీ

Published on Sun, 02/11/2024 - 11:36

రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ గ్రూపు-బిలో భాగంగా తిరువనంతపురం వేదికగా కేరళ, బెంగాల్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో కేరళ వెటరన్‌ స్పిన్నర్‌ జలజ్ సక్సేనా సంచలన ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 వికెట్లతో సక్సేనా చెలరేగాడు. సక్సేనా స్పిన్‌ ఉచ్చులో చిక్కుకున్న బెంగాల్‌ బ్యాటర్లు విల్లావిల్లాడారు.

21.1 ఓవర్లు బౌలింగ్‌ చేసిన జలజ్‌ కేవలం 68 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. అతడి స్పిన్‌ మయాజాలం ఫలితంగా బెంగాల్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే కుప్పకూలింది. కాగా సక్సేనాకు ఇవే ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అత్యుత్తమ గణాంకాలు కావడం గమనార్హం.

అదేవిధంగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో కేరళ బౌలర్‌గా సక్సేనా నిలిచాడు. ఈ జాబితాలో కేరళ గ్రేట్‌ స్పిన్నర్‌ అమర్జిత్ సింగ్ ఉన్నారు. 1972-73 రంజీ సీజన్‌లో ఓమ్యాచ్‌లో  అమర్జిత్ 49 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. అయితే 1973 తర్వాత మళ్లీ ఓ కేరళ బౌలర్‌ ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి.

కాగా సక్సేనా ప్రదర్శన పట్ల కేరళ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. అతడొక మాస్టర్‌ క్లాస్‌ స్పిన్నర్‌ అని కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కేరళ 363 పరుగులకు ఆలౌటైంది. కేరళ బ్యాటర్లలో సచిన్‌ బేబి(124) అక్షయ్ చంద్రన్(106) సెంచరీలతో రాణించారు. సంజూ మాత్రం కేవలం 8 పరుగులే చేసి నిరాశపరిచాడు.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)