Breaking News

ఆసీస్ యువ సంచలనానికి ల‌క్కీ ఛాన్స్‌.. వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో చోటు!?

Published on Sun, 05/19/2024 - 19:13

ఐపీఎల్‌-2024లో ఆస్ట్రేలియా యువ సంచ‌ల‌నం, ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓపెన‌ర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ త‌ర‌పున ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన మెక్‌గ‌ర్క్ టోర్నీ ఆసాంతం అద‌ర‌గొట్టాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన మెక్‌గ‌ర్క్‌.. 234.04 స్ట్రైక్ రేటుతో 330 ప‌రుగులు చేశాడు.

ఈ క్ర‌మంలో అత‌డికి ఆస్ట్రేలియా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ జట్టులో చోటు ఇవ్వాల‌ని సెల‌క్ట‌ర్లు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కాగా ఇప్ప‌టికే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌న‌కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును ఆస్ట్రేలియా క్రికెట్ ప్ర‌క‌టించింది.  ఈ జ‌ట్టులో మెక్‌గ‌ర్క్‌కు చోటు ద‌క్క‌లేదు.

కనీసం రిజర్వ్ జాబితాలో కూడా జేక్ ఫ్రేజ‌ర్‌కు అవ‌కాశం ఇవ్వ‌లేదు. సెల‌క్ట‌ర్ల నిర్ణ‌యం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే ఆసీస్ సెల‌క్ట‌ర్లు ఇప్పుడు త‌మ మ‌న‌సును మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది. జేక్ ఫ్రేజర్‌ను టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌న‌కు రిజ‌ర్వ్ ఆట‌గాడిగా ఎంపిక చేయాల‌ని ఆసీస్ సెల‌క్ష‌న్ క‌మిటీ నిర్ణయం తీసుకున్న‌ట్లు ఆసీస్ మీడియా వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఆసీస్ స్టార్ డేవిడ్ వార్న‌ర్‌కు బ్యాక‌ప్‌గా మెక్‌గ‌ర్క్‌ను ఎంపిక చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక జాన్ 1 నుంచి పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ ఆరంభం కానుంది. ఆసీస్ త‌మ తొలి మ్యాచ్‌లో జూన్ 5న ఒమెన్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

టీ20 ప్రపంచ క‌ప్‌న‌కు ఆస్ట్రేలియా జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్‌), ఆష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్. జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)