Breaking News

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్‌ మోహన్‌రావు..

Published on Fri, 10/20/2023 - 20:00

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) నూతన కార్యవర్గం కొలువు దీరింది. హెచ్‌సీఏ కొత్త అధ్యక్షుడిగా యునైటెడ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ హెచ్‌సీఏ ప్యానెల్‌ అభ్యర్థి జగన్‌ మోహన్‌రావు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ఎన్నికయ్యారు. శుక్రవారం ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి అమర్నాథ్‌పై ఒక్క ఓట్‌ తేడాతో జగన్‌ మోహన్‌రావు విజయం సాధించారు. అమర్నాథ్‌కు 62 ఓట్లు పడగా.. జగన్‌ మోహన్‌రావు 63 ఓట్లు సొంతం చేసుకున్నారు. 

అదే విధంగా హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడిగా దళ్జిత్‌ సింగ్ (గుడ్‌ గవర్నెన్స్‌ ప్యానెల్‌), సెక్రటరీగా దేవరాజు (క్రికెట్‌ ఫస్ట్‌ ప్యానెల్‌), జాయింట్‌ సెక్రటరీగా బసవరాజు (గుడ్‌ గవర్నెన్స్‌ ప్యానెల్‌), కోశాధికారిగా సీజే శ్రీనివాసరావు, (యునైటెడ్‌ మెంబర్స్‌ ప్యానెల్‌),  కౌన్సిలర్‌గా సునీల్‌ అగర్వాల్‌ (క్రికెట్‌ ఫస్ట్‌ ప్యానెల్‌) గెలుపొందారు.

కాగా మొత్తం 6 పదవుల కోసం బరిలో 24 మంది  పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 173 ఓట్లకు గాను 169 ఓట్లు పోలయ్యాయి. మాజీ క్రికెటర్లు వీవియస్‌ లక్ష్మణ్‌,  వెంకటపతి రాజు, మిథాలిరాజ్‌,స్రవంతి సహా పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా హెచ్‌సీఏ ఎన్నికల్లో రిటర్నింగ్‌ అధికారిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వీఎస్‌ సంపత్‌ వ్యవహరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)