Breaking News

టాప్‌లో కొనసాగుతున్న జడేజా.. అగ్రస్థానం దిశగా దూసుకొచ్చిన బంగ్లా ఆల్‌రౌండర్‌

Published on Wed, 05/07/2025 - 17:08

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు తమ ర్యాంక్‌లను పదిలంగా కాపాడుకున్నారు. బౌలర్ల విభాగంలో బుమ్రా టాప్‌ ప్లేస్‌ను నిలబెట్టుకోగా.. ఆల్‌రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. బ్యాటర్ల విభాగంలో జో రూట్‌ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. భారత బ్యాటర్లు యశస్వి జైస్వాల్‌ (4), రిషబ్‌ పంత్‌ (10), టాప్‌-10లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

ఆటగాళ్లంతా ఐపీఎల్‌లో బిజీగా ఉండటం చేత ఈ వారం ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. ఈ మధ్యలో బంగ్లాదేశ్‌, జింబాబ్వే మాత్రమే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడాయి. ఈ సిరీస్‌ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ సిరీస్‌లో బంగ్లా ఆల్‌రౌండర్‌ మెహిది హసన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి టెస్ట్‌లో 2 ఐదు వికెట్ల ప్రదర్శనలు సహా 10 వికెట్ల ఘనత.. రెండో టెస్ట్‌లో సెంచరీ సహా ఓ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. 

ఈ ప్రదర్శనల కారణంగా మిరాజ్‌ ర్యాంకింగ్స్‌లో భారీగా లబ్ది పొందాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో కెరీర్‌ బెస్ట్‌ రెండో ర్యాంకింగ్‌ సాధించి అగ్రపీఠం దిశగా దూసుకొచ్చాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లోనూ మిరాజ్‌ ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నాడు. బౌలింగ్‌లో రెండు స్థానాలు ఎగబాకి 24వ స్థానానికి చేరుకోగా.. బ్యాటింగ్‌ విభాగంలో 8 స్థానాలు మెరుగుపర్చుకుని 55వ స్థానానికి చేరాడు.

టాప్‌-10 టెస్ట్‌ బ్యాటర్లు
1. జో రూట్‌
2. హ్యారీ బ్రూక్‌
3. కేన్‌ విలియమ్సన్‌
4. యశస్వి జైస్వాల్‌
5. స్టీవ్‌ స్మిత్‌
6. టెంబా బవుమా
7. కమిందు మెండిస్‌
8. ట్రవిస్‌ హెడ్‌
9. ఉస్మాన్‌ ఖ్వాజా
10. రిషబ్‌ పంత్‌

టాప్‌-10 టెస్ట్‌ బౌలర్లు
1. జస్ప్రీత్‌ బుమ్రా
2. కగిసో రబాడ
3. పాట్‌ కమిన్స్‌
4. జోష్‌ హాజిల్‌వుడ్‌
5. నాథన్‌ లియోన్‌
6. నౌమాన్‌ అలీ
7. మార్కో జన్సెన్‌
8. మ్యాట్‌ హెన్రీ
9. ప్రభాత్‌ జయసూర్య
10. రవీంద్ర జడేజా

టాప్‌-5 టెస్ట్‌ ఆల్‌రౌండర్లు
1. రవీంద్ర జడేజా
2. మెహిది హసన్‌ మిరాజ్‌
3. మార్కో జన్సెన్‌
4. పాట్‌ కమిన్స్‌
5. షకీబ్‌ అల్‌ హసన్‌
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)