Breaking News

దంచికొట్టిన పెరీరా.. హెర్షల్‌ గిబ్స్‌ జట్టు ఘన విజయం

Published on Tue, 02/27/2024 - 20:58

ఇండియన్‌ వెటరన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IVPL 2024) ఎనిమిదో మ్యాచ్‌లో హెర్షల్‌ గిబ్స్‌ సారథ్యం వహిస్తున్న రెడ్‌ కార్పెట్‌ ఢిల్లీ జట్టు.. ముంబై ఛాంపియన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఛాంపియన్స్‌.. ఆష్లే నర్స్‌ (4-0-33-3), విక్రాంత్‌ శర్మ (4-0-21-3), ఒమర్‌ ఆలమ్‌ (2-0-7-1), ఆసేల గుణరత్నే (1-0-4-1) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ముంబై ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ ఝున్‌ఝున్‌వాలా (38) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. పీటర్‌ ట్రెగో (27), అమిత్‌ సనన్‌ (22), వి సోలంకి (14), వినయ్‌ యాదవ్‌ (13) రెండంకెల స్కోర్లు చేశారు.

అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు.. తిసారా పెరీరా (27 బంతుల్లో 64; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) విజృంభించడంతో 14.4 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో రిచర్డ్‌ లెవి (26), కెప్టెన్‌ గిబ్స్‌ (14), గుణరత్నే (17) వేగంగా పరుగులు సాధించారు.

ముంబై బౌలర్లలో సోలంకి 2, రాష్ట్రదీప్‌ యాదవ్‌, పీటర్‌ ట్రెగో, వినయ్‌ యాదవ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ లీగ్‌లో రేపు జరుగుబోయే మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌ లెజెండ్స్‌, చత్తీస్‌ఘడ్‌ వారియర్స్‌.. వీవీఐపీ ఉత్తర్‌ప్రదేశ్‌, ముంబై ఛాంపియన్స్‌ జట్లు తలపడనున్నాయి. 


 


 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)