Breaking News

ఐవరీకోస్ట్‌ గెలుపు బోణీ

Published on Fri, 12/26/2025 - 04:03

రబాట్‌ (మొరాకో): ఆఫ్రికా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఐవరీకోస్ట్‌ జట్టు శుభారంభం చేసింది. మొజాంబిక్‌ జట్టుతో జరిగిన గ్రూప్‌ ‘ఎఫ్‌’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో ఐవరీకోస్ట్‌ 1–0 గోల్‌ తేడాతో గెలిచింది. ఆట 49వ నిమిషంలో ఎమాద్‌ చేసిన గోల్‌తో ఐవరీకోస్ట్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని ఐవరీకోస్ట్‌ తమ ఖాతాలో మూడు పాయింట్లను వేసుకుంది. 

ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో కామెరూన్‌ 1–0 గోల్‌ తేడాతో గాబోన్‌ జట్టును ఓడించింది. ఆట ఆరో నిమిషంలో ఇట్టా ఇయోంగ్‌ గోల్‌ చేసి కామెరూన్‌ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత గాబోన్‌ జట్టు స్కోరును సమం చేసేందుకు యత్నించి విఫలమైంది. కామెరూన్‌–గాబోన్‌ మ్యాచ్‌తో ఆరు గ్రూప్‌ల తొలి రౌండ్‌ మ్యాచ్‌లు ముగిశాయి. 

గ్రూప్‌ ‘ఎ’లో ఆతిథ్య మొరాకో జట్టు... గ్రూప్‌ ‘బి’లో ఈజిప్‌్ట, దక్షిణాఫ్రికా జట్లు... గ్రూప్‌ ‘సి’లో ట్యునిషియా, నైజీరియా జట్లు... గ్రూప్‌ ‘డి’లో సెనెగల్, డీఆర్‌ కాంగో జట్లు... గ్రూప్‌ ‘ఇ’లో అల్జీరియా, బుర్కినఫాసో జట్లు... గ్రూప్‌ ‘ఎఫ్‌’లో ఐవరీకోస్ట్, కామెరూన్‌ జట్లు తమ ప్రత్యర్థి జట్లపై గెలుపొందాయి. నేడు జరిగే గ్రూప్‌ ‘ఎ’ రెండో రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో జాంబియాతో కొమోరోస్‌; మొరాకోతో మాలి... గ్రూప్‌ ‘బి’ రెండో రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో అంగోలాతో జింబాబ్వే; ఈజిప్ట్‌తో దక్షిణాఫ్రికా తలపడతాయి.   
 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)