Breaking News

ఇటలీ జట్టుదే బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌

Published on Mon, 09/22/2025 - 04:17

షెన్‌జెన్‌ (చైనా): డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇటలీ బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ను నిలబెట్టుకుంది. ప్రముఖ డేవిస్‌ కప్‌ తరహా మహిళల టీమ్‌ టెన్నిస్‌ టోర్నీలో ఇటలీ మళ్లీ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ఇటలీ 2–0 తేడాతో అమెరికాపై ఘనవిజయం సాధించింది. ఇటలీ స్టార్లు జాస్మిన్‌ పావోలిని, ఎలిసాబెట్టా కొకియారెటో వరుస సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో గెలుపొందారు. ఫలితం తేలిపోవడంతో డబుల్స్‌ మ్యాచ్‌ నిర్వహించాల్సిన అవసరం రాలేదు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ పావోలిని 6–4, 6–2తో ఏడో ర్యాంకర్‌ జెస్సికా పెగూలాను కంగుతినిపించింది. 

రెండో సింగిల్స్‌లో 91వ ర్యాంకర్‌ కొకొయారెటో 6–4, 6–4తో 11వ ర్యాంకులో ఉన్న ఎమ్మా నవారోను మట్టికరిపించింది. బ్రిటన్‌తో జరిగిన సెమీఫైనల్లో వరుస మ్యాచ్‌ల్లో అమెరికాను గెలిపించిన పెగులా, నవారో తుదిపోరులో మాత్రం చేతులెత్తేశారు. ఇటలీకి చెందిన ఒలింపిక్‌ చాంపియన్స్‌ పావోలిని, సారా ఎరానిలను బరిలోకి దించడం ద్వారా ఈ టోర్నీ చరిత్రలో ఆరో టైటిల్‌ సాధించింది. 

గత మూడు టోర్నీల్లో ఫైనల్స్‌కు చేరిన ఇటలీ 2023లో మాత్రం కెనడా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు అత్యధికంగా 18 సార్లు విజేతగా నిలిచిన అమెరికా 2017 తర్వాత మళ్లీ టైటిల్‌ గెలుపొందలేకపోయింది. బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ను గతంలో ఫెడ్‌ కప్‌గా నిర్వహించేవారు. 2020–21 సీజన్‌ నుంచే బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌గా పేరు మార్చారు. 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)