Breaking News

అనుభవం ముందు సిక్సర్ల తెవాటియా పనికిరాలేదు

Published on Tue, 05/02/2023 - 23:30

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరపున రాహుల్‌ తెవాటియా సూపర్‌ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎక్కువ మ్యాచ్‌ల్లో ఆఖర్లో బ్యాటింగ్‌ వచ్చి సిక్సర్లతో విధ్వంసం సృష్టిస్తూ సిక్సర్ల తెవాటియాగా పేరు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సిక్సర్ల తెవాటియా ఇషాంత్‌ అనుభవం ముందు తలవంచాల్సి వచ్చింది. 

అభినవ్‌ మనోహర్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన తెవాటియా ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో నోర్ట్జేకు చుక్కలు చూపించాడు. హ్యాట్రిక్‌ సిక్సర్లు బాది ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి మ్యాచ్‌ను దాదాపు లాగేసుకున్నంత పని చేశాడు. ఇక చివరి ఓవర్లో గుజరాత్‌ టైటాన్స్‌ విజయానికి 12 పరుగులు అవసరమైన దశలో ఇషాంత్‌ శర్మ అద్బుతంగా బౌలింగ్‌ వేశాడు. ఒత్తిడిలో సూపర్‌గా బౌలింగ్‌ చేసిన ఇషాంత్‌ ఇన్నేళ్ల అనుభవాన్ని చూపించాడు.


Photo: IPL Twitter

తొలి బంతికి హార్దిక్‌ పాండ్యా రెండు పరుగులు తీశాడు. ఆ తర్వాత బంతికి సింగిల్‌ తీయడంతో తెవాటియా మరోసారి స్ట్రైక్‌లోకి వచ్చాడు. ఇక మ్యాచ్‌ గుజరాత్‌దే అని అంతా భావించారు. కానీ ఇక్కడే ఇషాంత్‌ బౌలింగ్‌లో తన అనుభవాన్ని చూపించాడు. మూడో బంతిని తెలివిగా ఆన్‌ది లైన్‌ వేయడంతో డాల్‌బాల్‌ వచ్చింది. ఇక నాలుగో బంతిని తెవాటియా ఎక్స్‌ట్రా కవర్స్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాలనుకున్నాడు.

కానీ ఇషాంత్‌ అనుభవం ముందు సిక్సర్ల తెవాటియా పనికి రాలేదు. బౌన్స్‌ అయిన బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తాకి గాల్లోకి లేచింది. రిలీ రొసౌ పొరపాటు చేయకుండా క్యాచ్‌ తీసుకోవడంతో తెవాటియా వెనుదిరిగాడు. ఈ సమయంలో పాండ్యాఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ ఆసక్తి కలిగించింది. ఆ తర్వాత రెండు బంతుల్లో 9 పరుగులు కావాల్సిన దశలో మూడు పరుగులే తీయడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

చదవండి: ఏడో నెంబర్‌లో వచ్చి అదరగొట్టాడు.. ఎవరీ అమన్‌ హకీమ్‌ ఖాన్‌?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)