Breaking News

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఐర్లాండ్ జ‌ట్టు ప్ర‌కట‌న‌.. కెప్టెన్ ఎవ‌రంటే?

Published on Tue, 05/07/2024 - 22:16

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ మెగా టోర్నీలో ఐరీష్ జ‌ట్టుకు పాల్ స్టిర్లింగ్ నాయకత్వం వహించనున్నాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్‌తో పాటు స్వ‌దేశంలో పాకిస్తాన్‌తో జ‌రిగే టీ20 సిరీస్‌, నెదర్లాండ్స్ ,స్కాట్‌లాండ్‌తో జ‌రిగే ట్రై-సిరీస్‌కు ఐర్లాండ్ కూడా తమ జట్టును ప్రకటించింది.

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాల్గోనే జ‌ట్టునే ఈ రెండు సిరీస్‌లకు కూడా ఐరీష్ సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు. అయితే ఐపీఎల్‌-2024లో గుజ‌రాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ఐరీష్ పేస‌ర్ జాషువా లిటిల్‌.. పాక్‌, డ‌చ్‌, స్కాట్‌లాండ్‌తో ట్రై-సిరీస్‌కు దూరం కానున్నాడు.

ఇక ఐరీష్ వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో మాజీ కెప్టెన్ బ‌ల్బ‌ర్నీ, హ్యారీ టెక్టార్, కాంఫ్‌హెర్ వంటి స్టార్ ఆట‌గాళ్లు ఉన్నారు. ఇక ఈ మెగా టోర్నీలో ఐర్లాండ్ త‌మ తొలి మ్యాచ్‌లో జూన్ 5న టీమిండియాతో త‌ల‌ప‌డ‌నుంది. 

ఐర్లాండ్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ జట్టు:
పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.

పాక్‌, పాక్‌, డ‌చ్‌, స్కాట్‌లాండ్‌తో ట్రై-సిరీస్‌కు  ఐరీష్ జ‌ట్టు:
పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, బారీ మెక్‌కార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)