Breaking News

Irani Trophy 2023: సౌరాష్ట్రను దెబ్బకొట్టిన కావేరప్ప, సౌరభ్‌ కుమార్‌

Published on Mon, 10/02/2023 - 19:46

ఇరానీ ట్రోఫీ 2023లో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా జట్టు స్వల్ప ఆధిక్యం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌట్‌ కాగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ప్రస్తుతం సౌరాష్ట్ర.. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా స్కోర్‌కు 96 పరుగులు వెనుకపడి ఉంది.

ఐదేసిన పార్థ్‌ భట్‌..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా.. సాయి సుదర్శన్‌ (72), మయాంక్‌ అగర్వాల్‌ (32), హనుమ విహారి (33), శ్రీకర్‌ భరత్‌ (36), షమ్స్‌ ములానీ (32), సౌరభ్‌ కుమార్‌ (39) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. సౌరాష్ట్ర బౌలర్‌ పార్థ్‌ భట్‌ 5 వికెట్లతో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాను దెబ్బకొట్టాడు. ధరేంద్ర జడేజా (3/20), యువరాజ్‌ సింగ్‌ దోడియా (2/74) తలో చేయి వేశారు. 

సౌరాష్ట్రను దెబ్బకొట్టిన కావేరప్ప, సౌరభ్‌ కుమార్‌..
అనంతరం​ తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌరాష్ట్రను విధ్వత్‌ కావేరప్ప (3/28), సౌరభ్‌ కుమార్‌ (3/64) దెబ్బకొట్టారు. వీరిద్దరికి షమ్స్‌ ములానీ (2/46), పుల్కిత్‌ నారంగ్‌ (1/56) తోడవ్వడంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. హార్విక్‌ దేశాయి (0), చిరాగ్‌ జానీ (2), షెల్డన్‌ జాక్సన్‌ (13), జడేజా (11) విఫలం కాగా.. సమర్థ్‌ వ్యాస్‌ (29), చతేశ్వర్‌ పుజారా (29), ప్రేరక్‌ మన్కడ్‌ (29), పార్థ్‌ భట్‌ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో అర్పిత్‌ వసవద (54) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. జడదేవ్‌ ఉనద్కత్‌ (17), దోడియా (0) క్రీజ్‌లో ఉన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)