Breaking News

ఇరానీ కప్‌ విజేతగా ముంబై.. 27 ఏళ్ల తర్వాత!

Published on Sat, 10/05/2024 - 15:03

ఇరానీక‌ప్‌-2024 విజేత‌గా ముంబై నిలిచింది. కాన్పూర్ వేదిక‌గా రెస్ట్ ఆఫ్ ఇండియాతో జ‌రిగిన మ్యాచ్ డ్రాగా ముగియ‌డంతో.. తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా ముంబై ఛాంపియ‌న్స్‌గా అవ‌త‌రించింది. కాగా ముంబై ఇరానీక‌ప్‌ను సొంతం చేసుకోవ‌డం 27 ఏళ్ల త‌ర్వాత ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. 

ఓవరాల్‌గా ఇరానీ కప్‌ విజేత‌గా ముంబై నిల‌వ‌డం ఇది 15వ సారి. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ముంబై స్టార్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌(222 నాటౌట్‌) డబుల్‌ సెంచరీతో మెరిశాడు. అత‌డితో పాటు కొటియ‌న్‌(64) ప‌రుగుల‌తో రాణించాడు.  అనంత‌రం రెస్ట్ ఆఫ్ ఇండియా తమ మొద‌టి ఇన్నింగ్స్‌లో 416 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 

దీంతో ముంబై జ‌ట్టుకు 121 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. ఆ త‌ర్వాత త‌మ రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 8 వికెట్లు కోల్పోయి 329 ప‌రుగులు చేసింది. అయితే శనివారం(ఆక్టోబర్‌ 5) ఆఖరి రోజు ఆట కావడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రా అంగీకరించడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. కాగా ముంబై ఖాతాలో ఓవరాల్‌గా ఇది 62 దేశీవాళీ క్రికెట్‌ ట్రోఫీలు ఉన్నాయి. రంజీ ట్రోఫీలు-45, ఇరానీ కప్‌-15, విజయ్‌ హజారే ట్రోఫీ-4, సయ్యద్‌ ముస్తాక్‌ ఆలీ ట్రోఫీ-1 ముంబై పేరిట ఉన్నాయి.
చదవండి: అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్‌ కుమారుడు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)