Breaking News

ఐపీఎల్‌ 2025కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

Published on Thu, 05/15/2025 - 08:02

ఐపీఎల్‌ 2025కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. భారత్‌, పాక్‌ మధ్య యుద్దం కారణంగా స్వదేశాలకు వెళ్లిపోయిన ఆటగాళ్లకు తాత్కాలిక ప్రత్యామ్నాయాలకు ఎంపిక చేసుకునే వెసులుబాటును లీగ్‌ గవర్నింగ్‌ బాడీ కల్పించింది. అయితే ప్రత్యామ్నాయంగా వచ్చిన ఆటగాళ్లకు తదుపరి సీజన్‌కు (2026) అర్హత ఉండదని తెలిపింది. 

ఐపీఎల్‌ రూల్స్‌ ప్రకారం గాయపడిన ఆటగాళ్లకు మాత్రమే ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అది కూడా సీజన్‌లో వారి 12వ మ్యాచ్‌లోపే ఈ అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా గవర్నింగ్‌ బాడీ ఫ్రాంచైజీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. 

కాగా, మే 17 నుంచి లీగ్‌ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో చాలా మంది విదేశీ ఆటగాళ్లు వేర్వేరు కారణాల చేత అందుబాటులోకి రావడానికి మొరాయిస్తున్నారు. దీంతో ఫ్రాంచైజీలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ప్లే ఆఫ్స్‌ రేసులో ముందున్న ఫ్రాంచైజీలకు ఈ విషయం పెద్ద తలనొప్పిగా మారింది. 

ఫామ్‌లో లేని ఆటగాడు తిరిగి రాకపోతే ఫ్రాంచైజీలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఫామ్‌లో ఉన్న ఆటగాడిని వేరే ఆటగాడితో భర్తీ చేయాలన్నా ఫ్రాంచైజీలకు అది పెద్ద మైనస్సే అవుతుంది. ఏది ఏమైనా కీలక దశలో ప్రత్యామ్నాయ ఆటగాడిగాని ఎంపిక చేసుకునే వెసులుబాటులో లభించడంతో ఫ్రాంచైజీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే, భారత్‌-పాక్‌ మధ్య యుద్దం కారణంగా లీగ్‌ వారం రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. యుద్దం సమసిపోవడంతో లీగ్‌ రివైజ్డ్‌ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ షెడ్యూల్‌ వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్‌తో క్లాష్‌ అయ్యింది. ఈ సిరీస్‌ జరగాల్సిన మే 29, జూన్‌ 1, 3 తేదీల్లో ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ రీ షెడ్యూల్‌ అయ్యాయి. దీంతో ప్లే ఆఫ్స్‌కు ఎంపికైన ఫ్రాంచైజీలకు సంబంధించిన ఆటగాళ్లు (ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ సిరీస్‌కు ఎంపికైన వారు) దేశమా.. ఐపీఎలా అని తేల్చుకోలేకపోతున్నారు.

దేశానికే ఆడాలని విండీస్‌ క్రికెట్‌ బోర్డు తమ ఆటగాళ్లపై (ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపికైన వారిని) ఎలాంటి ఒత్తిడి చేయనప్పటికీ.. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు మాత్రం జాతీయ విధులే ముఖ్యమని తేల్చి చెప్పింది. దీంతో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు లీగ్‌ దశ మ్యాచ్‌లు పూర్తి కాగానే జాతీయ విధులు నిర్వర్తించేందుకు వెళ్లిపోతారు. విండీస్‌ ఆటగాళ్లు ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉంటారా లేరా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.  

ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ సమయంలో జరిగే వన్డే మ్యాచ్‌ల్లో పాల్గొనాల్సిన ఇంగ్లండ్‌, విండీస్‌ ఆటగాళ్లు..

జేకబ్‌ బేతెల్‌ (ఆర్సీబీ)
విల్‌ జాక్స్‌ (ముంబై ఇండియన్స్‌)
జోస్‌ బట్లర్‌ (గుజరాత్‌)

షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (గుజరాత్‌)
రొమారియో షెపర్డ్‌ (ఆర్సీబీ)

  • జోఫ్రా ఆర్చర్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌), జేమీ ఓవర్టన్‌ (సీఎస్‌కే) కూడా ఈ సిరీస్‌కు ఎంపికైనప్పటికీ వారి ఫ్రాంచైజీలు ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించాయి. 

 

#

Tags : 1

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)