Breaking News

సన్‌రైజర్స్‌ కోలుకునేనా!

Published on Sun, 04/06/2025 - 02:22

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌–2025లో తమ తొలి మ్యాచ్‌లో 286 పరుగులు చేసి రాజస్తాన్‌పై ఘనవిజయంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సీజన్‌ను ప్రారంభించింది. అయితే ఆ తర్వాత జట్టు ప్రదర్శన ఒక్కసారిగా పడిపోయింది. సొంత మైదానంలో లక్నో చేతిలో ఓడిన టీమ్‌...ఆపై వరుసగా ఢిల్లీ, కోల్‌కతా చేతుల్లో చిత్తుగా ఓడింది. ఇప్పుడు మళ్లీ హోం గ్రౌండ్‌కు చేరిన జట్టు వరుస ఓటముల నుంచి కోలుకోవాలని పట్టుదలగా ఉంది.

నేడు జరిగే పోరులో గుజరాత్‌ టైటాన్స్‌తో హైదరాబాద్‌ తలపడుతుంది. ఐపీఎల్‌లో అతి పెద్ద పరాజయాన్ని గత మ్యాచ్‌లో మూటగట్టుకున్న టీమ్‌ను మళ్లీ ముందంజలో నిలిపే బాధ్యత బ్యాటర్లపైనే ఉంది. హెడ్, అభిషేక్, ఇషాన్‌ కిషన్‌ చెలరేగితే భారీ స్కోరు సాధించవచ్చు. క్లాసెన్‌ మెరుగ్గానే ఆడుతున్నా... నితీశ్‌ రెడ్డి ఇంకా ఫామ్‌ను అందుకోలేదు. 

కమిందు మెండిస్‌ ఆల్‌రౌండ్‌ ఆట సానుకూలాశం. షమీ, కమిన్స్‌ బౌలింగ్‌లో మరింత ప్రభావం చూపించాల్సి ఉంది. బెంగళూరుపై చెలరేగిన హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ ఇప్పుడు గుజరాత్‌ తరఫున తన సొంత ఊరిలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. సుదర్శన్, గిల్, బట్లర్‌ తదితరులతో టైటాన్స్‌ బ్యాటింగ్‌ కూడా పటిష్టంగా కనిపిస్తోంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)