Breaking News

IPL 2025: సన్‌రైజర్స్‌ జట్టులో చరిత్ర సృష్టించిన బౌలర్‌

Published on Mon, 05/05/2025 - 10:31

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో నిష్క్రమణకు అంచుల్లో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఇవాళ (మే 5) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగబోయే డు ఆర్‌ డై మ్యాచ్‌కు ముందు కీలక ప్రకటన చేసింది. గాయపడిన స్మరణ్‌ రవిచంద్రన్‌ స్థానంలో విదర్భ లెఫ్డ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హర్ష్‌ దూబేను జట్టులోకి తీసుకుంది. 

హర్ష్‌ను బేస్‌ ధర రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. కొద్ది రోజుల ముందే స్మరణ్‌ ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాకు ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చాడు. స్మరణ్‌ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే గాయంతో సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. అంతకుముందు జంపా రెండు మ్యాచ్‌లు ఆడి ప్రాక్టీస్‌ సందర్భంగా గాయపడ్డాడు.

ఎవరీ హర్ష్‌ దూబే..?
పూణేలో జన్మించి, విదర్భ తరఫున దేశవాలీ క్రికెట్‌ ఆడుతున్న 22 ఏళ్ల హర్ష్‌ దూబే..  తాజాగా ముగిసిన రంజీ సీజన్‌లో (2024-25) రికార్డు స్థాయిలో 10 మ్యాచ్‌ల్లో 69 వికెట్లు (7 ఐదు వికెట్ల ప్రదర్శనలతో పాటు రెండు 10 వికెట్ల ప్రదర్శనలు) తీసి, రంజీ చరిత్రలోనే ఓ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. 

హర్ష్‌ విదర్భ తరఫున 18 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 21 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు, 16 టీ20లు ఆడి 128 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో దాదాపు 100 పరుగులు చేశాడు. హర్ష్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 7 అర్ద సెంచరీలు, లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 2 అర్ద సెంచరీలు సాధించాడు.

హర్ష్‌ అద్బుత ప్రదర్శన కారణంగా గత రంజీ సీజన్‌లో విదర్భ ఛాంపియన్‌గా నిలిచింది. విదర్భ రంజీ టైటిల్‌ గెలవడం ఇది మూడో సారి. ఫైనల్లో విదర్భ కేరళపై విజయం సాధించి, ఛాంపియన్‌గా అవతరించింది.

నిష్క్రమణ అంచుల్లో ఎస్‌ఆర్‌హెచ్‌
ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో గత సీజన్‌ రన్నరప్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేలవ ప్రదర్శనలు చేస్తూ నిష్క్రమణ అంచుల్లో ఉంది. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 పరాజయాలు చవిచూసి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 

ఈ నాలుగు గెలిచినా సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరడం అసంభవం. టెక్నికల్‌గా ఆ జట్టు ఇంకా ఎలిమినేట్‌ కాలేదు కానీ, ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ పని అయిపోయింది. ఇవాళ (మే 5) ఆ జట్టు సొంత మైదానంలో (ఉప్పల్‌ స్టేడియం) టేబుల్‌ ఫిఫ్త్‌ టాపర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)